Kumaram Bheem Asifabad: సంక్షేమ పథకాల అమలు పకడ్బందీగా నిర్వహించాలి: ఎంపీ గోడం నగేష్
ABN, Publish Date - Aug 24 , 2024 | 10:16 PM
ఆసిఫాబాద్, ఆగస్టు 24: రాష్ట్రఅభివృద్ధిలో భాగంగా కేంద్రప్రభుత్వం మంజూరుచేసిన నిధులతో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలును పకడ్బందీగా నిర్వహించాలని ఎంపీ గోడం నగేష్ అన్నారు.
- ఎంపీ గోడం నగేష్
ఆసిఫాబాద్, ఆగస్టు 24: రాష్ట్రఅభివృద్ధిలో భాగంగా కేంద్రప్రభుత్వం మంజూరుచేసిన నిధులతో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలును పకడ్బందీగా నిర్వహించాలని ఎంపీ గోడం నగేష్ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో కలెక్టర్ వెంకటేష్‌దోత్రే, అదనపుకలెక్టర్ దీపక్‌తివారి, ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు తో కలిసి జిల్లాగ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణకమిటీ జిల్లాస్థాయి సమావేశానికి ఆయన హాజ రయ్యా రు. ఈసందర్భంగా మాట్లాడుతూ వైద్యఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధులనియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. వ్యాధుల వ్యాప్తి పై సర్వేనిర్వహించాలని, వ్యాధుల నియంత్రణపై అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లాలో 803మంది ఆశాకార్యకర్తలకుగాను 736మంది పనిచేస్తున్నారని, 67 ఖాళీలు, 22స్టాఫ్‌నర్సుల ఖాళీలను వెంటనే భర్తీచేసే విధంగాచర్యలు తీసుకోవా లని తెలిపారు. జిల్లాలో ప్రభుత్వపాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ద్వారా పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందిస్తామని తెలిపారు. మనఊరు మనబడి, అమ్మ ఆదర్శపాఠశాలల కమిటీ పథకాల ద్వారా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. పంచాయతీరాజ్, రోడ్లు భవనాలశాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి సడక్‌యోజనకింద బీటీరోడ్ల నిర్మాణా నికి చర్యలు తీసుకుం టున్నామని తెలిపారు. కాగజ్‌నగర్ మున్సిపాలిటీ స్వచ్చ భారత్‌లో భాగంగా ఎంపిక అయిందని తెలిపారు. మారుమూల ప్రాంతాల్లో 56బీఎస్‌ఎన్‌ఎల్ టవర్లుమంజూరు కాగా10టవర్ల నిర్మాణానికి అటవీ అనుమ తులు రావాల్సి ఉందని తెలిపారు. ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం ద్వారా చేతి వృత్తులవారికి రుణాల మంజూరుకు 2048 దరఖాస్తులు రాగా 567మందికి రుణాలు మంజూరుకు సిఫారసు చేశామన్నారు. మిగితా దరఖాస్తులు పరిశీల నలో ఉన్నాయని తెలిపారు. జిల్లాలో 41.5కిలోమీటర్ల మేర నాలుగు వరుసల జాతీయ రహదారి ఉందని, రహదారిపై గుంతలు ఏర్పడ్డాయని, వెంటనే పనులు చేపట్టి త్వరితగతిన పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఎస్‌ఈ వాసుదేవ్, డీఈవో అశోక్, మున్సిపల్ కమిషనర్ అంజయ్య, జిల్లా సంక్షేమశాఖాధికారి భాస్కర్ పాల్గొన్నారు.
Updated Date - Aug 24 , 2024 | 10:16 PM