ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kumaram Bheem Asifabad:మహిళాశక్తి పథకంలో యూనిట్ల గుర్తింపు వేగవంతం చేయాలి

ABN, Publish Date - Jul 15 , 2024 | 10:55 PM

ఆసిఫాబాద్‌ రూరల్‌, జూలై 15: మహిళల అభివృద్ధి కొరకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహిళాశక్తి పథకంలో యూనిట్ల గుర్తింపు ప్రక్రి యను వేగవంతంచేయాలని అదనపుకలెక్టర్‌ దీపక్‌తివారి అన్నారు.

-అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి

ఆసిఫాబాద్‌ రూరల్‌, జూలై 15: మహిళల అభివృద్ధి కొరకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహిళాశక్తి పథకంలో యూనిట్ల గుర్తింపు ప్రక్రి యను వేగవంతంచేయాలని అదనపుకలెక్టర్‌ దీపక్‌తివారి అన్నారు. సోమ వారం కలెక్టరేట్‌లో మహిళాశక్తి పథకం యూనిట్‌లు గుర్తించడంపై సెర్ప్‌ అసిస్టెంట్‌ ప్రాజెక్టుమేనేజర్లు, జిల్లామేనేజర్లతో సమీక్షసమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిమండలంలో మహిళా సంఘాలతో సమావేశంనిర్వహించి ఔత్సాహిక మహిళాసంఘాలను మహిళా శక్తి పథకంద్వారా యూనిట్లు ప్రారంభించే విధంగా ప్రోత్సహించాలని తెలి పారు. చేపల పెంపకం, కోళ్లపెంపకం, డెయిరీ ఫార్మ్‌ నిర్వహణ, క్యాంటీన్లు, మీ సేవకేంద్రాల నిర్వహణ, చిన్నపరిశ్రమల ఏర్పాటు వంటి5రకాల యూనిట్‌లను గుర్తించి మహిళాసంఘాలు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఆ సంఘాలకు స్త్రీనిధి పథకంద్వారా రుణాలను అందించి ప్రోత్సహించాలని తెలిపారు. అనంతరం మండలాలవారీగా యూనిట్లపై సమీక్షించారు. సమా వేశంలో జిల్లా అదనపు గ్రామీణాభివృద్ధి అధికారి రామకృష్ణ, స్త్రీనిధి రీజనల్‌ మేనేజర్‌ శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 15 , 2024 | 10:55 PM

Advertising
Advertising
<