ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kumaram Bheem Asifabad: ఆరోగ్య బీమా.. వృద్ధులకు ధీమా

ABN, Publish Date - Sep 16 , 2024 | 11:09 PM

వాంకిడి, సెప్టెంబరు 16: ప్రజావైద్యానికి కేంద్రప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. పేద, ధనిక తారతమ్యం లేకుండా 70ఏళ్లు పైబడిన వారందరికి రూ.5లక్షల ఉచిత వార్షిక ఆరోగ్యబీమా సౌకర్యాన్ని కల్పించే నూతన పథకానికి శ్రీకారం చుట్టింది.

- ప్రజావైద్యానికి కేంద్రం పెద్దపీట

- 70ఏళ్లు పైబడిన వృద్ధులకు ప్రయోజనం

వాంకిడి, సెప్టెంబరు 16: ప్రజావైద్యానికి కేంద్రప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. పేద, ధనిక తారతమ్యం లేకుండా 70ఏళ్లు పైబడిన వారందరికి రూ.5లక్షల ఉచిత వార్షిక ఆరోగ్యబీమా సౌకర్యాన్ని కల్పించే నూతన పథకానికి శ్రీకారం చుట్టింది. ఈమేరకు రూ.3.427కోట్లతో పథకాన్ని అమలు చేసేందుకు కేంద్రమంత్రివర్గం బుధవారం ఆమోదు ముద్ర వేసింది. దీనివల్ల అన్ని సామాజికవర్గాల వృద్ధులకు వైద్య బీమా లభించనుంది. దరఖాస్తు చేసుకున్న వారికి నూతనకార్డులు జారీ చేయనుంది. దేశప్రజల ఆరోగ్య సంరక్షణలో భాగంగా కేంద్రప్రభుత్వం ఆయుష్మాన్‌ భారత్‌, ప్రధానమంత్రి జన్‌ఆరోగ్యయోజన(ఏబీ పీపెం- జేఏవై)ను 2018నుంచి అమలు చేస్తోంది. తాజాగా ఈ పథకాన్ని 70ఏళ్లు పైబడిన వృద్ధులకు విస్తరించింది. ఆదాయంతో సబంధం లేకుండా వృద్ధులందరూ ఆయుష్మాన్‌ భారత్‌ పథకం ద్వారా రూ.5లక్షల వరకు ఆరోగ్య బీమా పొందవచ్చు.

- వృద్ధులకు ప్రయోజనం..

వయసు పెరిగేకొద్దీ వృద్ధాప్యంలో ఆరోగ్య సమస్యలు వెంటాడుతాయి. ప్రస్తుతం వైద్యంపై చేసే వ్యయం సైతం భారీగా పెరిగిపోతున్న తరు ణంలో కేంద్రప్రభత్వుం తీసుకొచ్చిన రూ.5లక్షల ఉచిత వార్షికఆరోగ్య బీమా పథకం ద్వారా ఉమ్మడి ఆదిలాబాద్‌జిల్లాలో వేలమంది వృద్ధులకు ప్రయోజనం చేకూరనుంది. ఆయాకుటుంబాలపై ఆర్థికభారాన్ని తగ్గించ నుంది. అయితే ఈ పథకం ద్వారా ఒక కుటుంబంలో 70ఏళ్లు పైబడిన వారు ఒక్కరు ఉంటే రూ.5లక్షల వరకు బీమా వర్తిస్తుంది. అదే కుంటుంబలో ఇద్దరు ఉంటే రూ.2.50లక్షల చొప్పున ఇలా.. కుటంబంలో 70 ఏళ్లు పైబడినవారు ఎంత మంది ఉన్న వారందరికీ రూ.5లక్షలు సమానంగా వర్తిస్తాయి. ఇప్పటికే వేర్వేరు బీమాపథకాల్లో నమోదైన వృద్ధులు సైతం ఆముష్మాన్‌ భారత్‌లో లబ్ధిపొందవచ్చు. ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేటు ఆసుపత్రుల్లో ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది.

- అర్హతలు...

- ఇప్పటివరకు ఈపథకం ఆర్థికంగా వెనుకబడిన కొన్నివర్గాల ప్రజలకు మాత్రమే అందుబాటులో ఉంది. కేంద్రప్రభుత్వం తాజా నిర్ణ యంతో ఆదాయంతో సంబంధం లేకుండా 70ఏళ్లు పైబడిన వృద్ధులం దరికీ కుటుంబం ఆధారంగా రూ.5లక్షల ఆరోగ్య బీమా వ ర్తిస్తుంది.

- ప్రైవేటు ఆరోగ్య బీమా ఉన్నవారికి ఈపథకం వర్తిస్తుంది.

- ఇప్పటివరకు కేంద్రప్రభుత్వ హెల్త్‌ స్కీమ్‌(సీజీహెచ్‌ఎస్‌) ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ కాంట్రీబ్యూటరీ హెల్త్‌స్కీమ్‌(ఈసీహెచ్‌ఎస్‌) వంటి ఇతర పథకాలద్వారా ప్రయోజనం పొందుతున్నవారు వాటినే కొనసాగించ వచ్చు. లేదా ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని ఎంచుకోవచ్చు.

- రాష్ట్ర ప్రభుత్వ బీమా పథకాలు పొందేవారికి వాటితో సంబంధం లేకుండా ఈ పథకం వర్తిస్తుంది.

- అవగాహన కల్పించాలి

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న ఆయుష్మాన్‌ భారత్‌ పథకం విధివిధానాలపై ప్రజల్లో స్పష్టమైన అవగాహన కల్పించా ల్సిన అవసరం ఉంది. 2018నుంచి ఈ పథకం అమలవుతున్నా అర్హులెవరనే దానిపై ప్రజల్లో స్పష్టత లేదు. అర్హులకు ఏఏ ఆసుపత్రుల్లో వైద్యం అందుబాటులో ఉంటుంది, బీమా ఎలా వర్తింపచేసుకోవాలి అనే అంశాల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఎలాంటి ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా 70ఏళ్లు పైబడిన వారందరికీ ఈ పథకం వర్తింపచేయనుండడంతో దరఖాస్తు విధానం, బీమా పొంద టంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతెనా ఉంది.

Updated Date - Sep 16 , 2024 | 11:10 PM

Advertising
Advertising