ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Kumaram Bheem Asifabad: ఎండిపోయిన పాల్వాయి ప్రాజెక్టు

ABN, Publish Date - Apr 26 , 2024 | 10:13 PM

దహెగాం, ఏప్రిల్‌ 26: దహెగాం మండలంలోని కల్వాడ గ్రామ సమీపంలోని పాల్వాయిపురుషోత్తమరావు ప్రాజెక్టు ఎండి పోయి ఎడారిని తలపిస్తోంది. దీంతో ప్రాజెక్టు ఆయకట్టు కింద వేసిన వరి పంట నీరు లేక ఎండిపోతోంది.

- నీరందక ఎండిన వరిపంట

- దిక్కుతోచని స్థితిలో రైతులు

దహెగాం, ఏప్రిల్‌ 26: దహెగాం మండలంలోని కల్వాడ గ్రామ సమీపంలోని పాల్వాయిపురుషోత్తమరావు ప్రాజెక్టు ఎండి పోయి ఎడారిని తలపిస్తోంది. దీంతో ప్రాజెక్టు ఆయకట్టు కింద వేసిన వరి పంట నీరు లేక ఎండిపోతోంది. సాగునీటి విడుదల చేసే తీరు లేకపోవడంతోనే తమ వరి పొలాలు ఎండిపోతున్నాయని ఆయా గ్రామాల రైతులు ఆరోపిస్తున్నారు.

3100ఎకరాల్లో వరిపంట సాగు..

కల్వాడ, కుంచవెల్లి, చంద్రపల్లి, పీకల గుండం, భామానగర్‌ తదితర గ్రామాల్లోని రైతులకు పాల్వాయి ప్రాజెక్టు నీరే ఆధారం. ఈ ప్రాజెక్టు ఆయకట్టు కింద వానాకాలం రైతులు 3100ఎకరాల్లో వరిపంటను సాగు చేశారు. పంట వేసే క్రమంలో ప్రాజెక్టులో పుష్కలంగా నీరుంది. దీంతో రైతులు వరి వేస్తే బాగుంటుందని భావించి వేశారు. కానీ నీటి విడుదల సక్రమంగా లేకపోవడంతో ప్రాజెక్టు తొందర్లోనే ఎండిపోయింది. దీంతో నీరంది పంటలు బాగా పండుతాయి అని ఆశించిన రైతులకు నిరాశే ఎదురైంది. ప్రాజెక్టులో నీరు లేకపోవడంతో చివరి పంట పొలాలకు సాగు నీరంద లేదు. పంటలకు నీరందక పదుల ఎకరాల్లో పొలాలన్నీ బీడుబారాయి. సాగునీటి విడుదల తీరు సక్రమంగా లేక పోవడంతోనే వరిపొలాలు ఎండిపోతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు.

వరిపంట ఎండిపోయింది..

- తాళ్ల దామాజీ, రైతు, పీకలగుండం

రెండు ఎకరాల్లో వేసిన వరిపంట ఎండిపోయింది. పెట్టుబడి ఖర్చులు కూడా రాని పరిస్థితి. ప్రభుత్వం స్పందించి నష్టపరి హారం అందించి ఆదుకోవాలి.

పశువులకు వదిలేశాను..

- దుర్గం వెంకటి, పీకలగుండం

వానా కాలంలో సాగు చేసిన వరి పొలం ఎండి పోయింది. ప్రాజెక్టు కూడా ఎండిపో యింది. దిక్కులేని పరిస్థితుల్లో ఎండిన వరిపొలాన్ని పశువులకు వదిలివేశాను.

Updated Date - Apr 26 , 2024 | 10:13 PM

Advertising
Advertising