ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Kumaram Bheem Asifabad: రోగులకు మెరుగైన వైద్యం అందించాలి: కలెక్టర్‌

ABN, Publish Date - Apr 22 , 2024 | 10:41 PM

ఆసిఫాబాద్‌, ఏప్రిల్‌ 22: ఆసుపత్రికి వచ్చే రోగు లకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. సోమవారం జిల్లా కేంద్రం లోని ప్రభుత్వ ఆసుపత్రిని సూపరింటెండెంట్‌ చెన్న కేశవులుతో కలిసి పరిశీలించారు.

- కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే

ఆసిఫాబాద్‌, ఏప్రిల్‌ 22: ఆసుపత్రికి వచ్చే రోగు లకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. సోమవారం జిల్లా కేంద్రం లోని ప్రభుత్వ ఆసుపత్రిని సూపరింటెండెంట్‌ చెన్న కేశవులుతో కలిసి పరిశీలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. వైద్యులు, సిబ్బందితో సేవలు, పలు అంశాలపై సూచనలు, సల హాలు చేశారు. సమయపాలన పాటిస్తూ రోగులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూడాలని ఆదేశిం చారు. ఆసుపత్రి పరిసరాలు, టాయిలెట్లు పరిశు భ్రంగా ఉండేలా చూడాలన్నారు. ఎప్పటికప్పుడు శాని టైజేషన్‌ చేయాలన్నారు. ఎండతీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రజలు వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉందన్నారు. దీనిపై ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు ప్రజల్లోకి వెళ్లి అవగాహన కల్పించాల న్నారు. ఎండవేడి వల్ల అస్వస్థతకు గురైనప్పుడు ముందుగా తీసుకోవా ల్సిన జాగ్రత్తల గురించి తెలియజే యాలన్నారు. ఉపాధిహామీ కూలీ లను నిత్యం అప్రమత్తం చేస్తుం డాలని తెలిపారు. బయటకు వెళ్లేట ప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేయాలన్నారు. ఆసు పత్రుల్లో ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందు బాటులో ఉంచాలన్నారు. వైద్యులతో పాటు కిందిస్థాయి సిబ్బంది తప్పనిసరిగా సమయ పాలన పాటించాలని తెలిపారు. రోగులపట్ల మానవ త్వంతో వ్యవహరించాలని అన్నారు. ఆసుపత్రిలోని రికార్డుల్లో ఎప్పటికప్పుడు వివరాలను నమోదు చేయా లన్నారు. పెండింగ్‌ లేకుండా చూడాలన్నారు. ఆసు పత్రిలో నిర్మిస్తున్న అదనపు గదుల నిర్మాణ పనులను పరిశీలించి సత్వరమే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీఎం హెచ్‌వో తుకారాం భటల్‌, మెడికల్‌ కళాశాల ప్రిన్సి పాల్‌ నాగార్జునచారి, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ చెన్న కేశవులు, ఇంజనీర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Apr 22 , 2024 | 10:41 PM

Advertising
Advertising