Kumaram Bheem Asifabad: ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి: కలెక్టర్
ABN, Publish Date - Jul 31 , 2024 | 10:06 PM
కాగజ్‌నగర్, జూలై 31: ప్రభుత్వాసుపత్రి సిబ్బంది ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషిచేయాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు.
-కలెక్టర్ వెంకటేష్ దోత్రే
కాగజ్‌నగర్, జూలై 31: ప్రభుత్వాసుపత్రి సిబ్బంది ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషిచేయాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. బుధవారం కాగజ్‌నగర్ సీహెచ్‌సీని ఆయన సందర్శించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది కొరత లేకుండా చూస్తామన్నారు. వర్షాకాలంలో వచ్చే వ్యాధుల పట్ల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. అదనపు కలెక్టర్ దీపక్ తివారి మాట్లాడుతూ వర్షాలు కురిసిన సందర్భంగా ఇండ్లలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆసుపత్రిలోని పలు రికార్డులు పరిశీలించారు. అనంతరం రోగులకు అందు తున్న వైద్యసేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారి వెంట ఆర్డీవో సురేష్, మెడికల్ సూపరింటెండెంట్ చెన్నకేశవ, తహసీల్దార్ కిరణ్‌కుమార్, జిల్లా ఉపవైద్యాధికారి సీతారాం, ఏపీడీ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
మహిళా శక్తి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి..
ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళాశక్తి పథకం ద్వారావచ్చే రుణాలతో మహిళలు ఆర్థికంగా ఎదగాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. బుధవారం కాగజ్‌నగర్ మండలంలోని నజ్రూల్‌నగర్‌లో మహిళా శక్తి పథకం ద్వారా నిర్వహిస్తున్న కోళ్లపెంపకాన్ని ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో మహిళా శక్తి పథకం కింద 200కుటుంబాలకు పెరటి కోళ్లను అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటివరకు అందిన దరఖాస్తులను పరిశీలిస్తున్నామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దీపక్ తివారి, ఆర్డీవో సురేష్, తహసిల్దార్ కిరణ్ కుమార్, జిల్లా అదనపు గ్రామీణ అభివృద్ధి అధికారి రామకృష్ణ, పీఎం సారయ్య, సహాయక ప్రాజెక్టు మేనేజర్లు శ్రీనివాస్, భూమక్క పాల్గొన్నారు.
Updated Date - Jul 31 , 2024 | 10:06 PM