Kumaram Bheem Asifabad: మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించేందుకు చర్యలు: కలెక్టర్
ABN, Publish Date - Jul 31 , 2024 | 10:04 PM
ఆసిఫాబాద్, జూలై 3: మహిళా, శిశుసంక్షేమం కోసం జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా మెనూప్రకారం పోషక విలు వలు కలిగిన ఆహారాన్ని సకాలంలో అందించేందుకు చర్య లు తీసుకుంటామని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు.
- కలెక్టర్ వెంకటేష్ దోత్రే
ఆసిఫాబాద్, జూలై 3: మహిళా, శిశుసంక్షేమం కోసం జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా మెనూప్రకారం పోషక విలు వలు కలిగిన ఆహారాన్ని సకాలంలో అందించేందుకు చర్య లు తీసుకుంటామని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. బుధవారం అదనపు కలెక్టర్ దీపక్ తివారి, జిల్లా సంక్షేమ శాఖాధికారి భాస్కర్‌తోకలిసి అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, కిశోరబాలికలు, పిల్లలకు పౌష్టి కాహారం, అవసరమైన మందులనుఅందించడంపై యూని సెఫ్ ప్రతినిధులు, పోషన్‌అభియాన్ సమన్వయ కర్తలు, ఆహారవిభాగం సమన్వయకర్తలతో సమీక్షసమావేశం నిర్వ హించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అంగన్ వాడీకేంద్రాల ద్వారా పిల్లల సంరక్షణకు అన్నిచర్యలు తీసుకుంటామని తెలిపారు. శామ్-మామ్ ప్రక్రియలో శారీరక, మానసిక ఎదుగు దల లోపంఉన్న పిల్లలనుగుర్తించి వారిని సాధా రణస్థితికి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుం టామని తెలిపారు. గిరిజనప్రాంతాలలో పీవీటీజీ కులానికి చెందిన పిల్లలపై ప్రత్యేకదృష్టి సారించి అంగన్‌వాడీ కేంద్రాలద్వారా అన్ని వసతుల కల్పనకు చర్యలు చేపడు తామన్నారు. అంగన్‌వాడీ టీచర్లు, ఆశాకార్యకర్తలు, ఆయాలు, ఆరోగ్య కార్యకర్తలకు అవసరమైన శిక్షణ అందించడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కార్యక్ర మంలో యూనిసెఫ్ ప్రతినిధులు ఖ్యాతి తివారి, రేషదేశాయ్, నరసింహారావు, పోషన్‌అభియాన్ సమన్వయకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
రెండు వరుసల్లో మొక్కలు నాటాలి..
జిల్లాలో వనమహోత్సవంలో భాగంగా ప్రతి చోట రెండు వరుసల్లో మొక్కలు నాటాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. జిల్లాకేంద్రంలోని డీపీవో కార్యాలయంలో నిర్వహించి వన మహోత్సవంలో ఎస్పీ డీవీ శ్రీనివాస్‌రావు, జిల్లా అటవీశాఖాధికారి నీరజ్‌కుమార్ టిబ్రేవాల్‌తో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ జిల్లాలక్ష్యమైన 53లక్షలు 40విభాగాలకు కేటాయిం చినట్లు తెలిపారు. ఆయా విభాగాల్లో ఉన్న స్థలాన్ని విని యోగించుకుని లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. కొత్త రోడ్లను గుర్తించి వాటి పక్కన మొక్కలు నాటాలన్నారు. ఇప్పటి వరకు 60శాతం మొక్కల లక్ష్యాన్ని పూర్తిచేసినట్లు తెలి పారు. నాటిన ప్రతిమొక్క బతికేలా చూడాలన్నారు. ప్రతి రోజు ఒక్కోక్క విభాగం ఆధ్వర్యంలో మొక్కలు నాటుతు న్నట్లు తెలిపారు. వర్షాలు సమృద్ధిగా కురుస్తున్న నేపథ్యం లో సాధ్యమైంత త్వరగా లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీలు సదయ్య, కరుణాకర్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - Jul 31 , 2024 | 10:04 PM