నిప్పుల కొలిమి
ABN, Publish Date - May 30 , 2024 | 10:35 PM
మంచిర్యాల జిల్లాలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుకొంటున్నాయి. గురువారం భీమారం మండలంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 47.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
మంచిర్యాల, మే 30 (ఆంధ్రజ్యోతి): మంచిర్యాల జిల్లాలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుకొంటున్నాయి. గురువారం భీమారం మండలంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 47.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గతేడాది ఇదే సమయానికి లక్షెట్టిపేట మండలం శాంతాపూర్‌లో 36.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా ఈయేడు రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం. వేమనపల్లి మండలం నీల్వాయిలో 46.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదుకాగా, బెల్లంపల్లి మండలం, చెన్నూరు మండలం కొమ్మెరలో 46.0 డిగ్రీలు, హాజీపూర్ మండలంలో 45.7, కాసిపేట మండలం కొండాపూర్‌లో 45.4, పాత మంచిర్యాలలో 45.4, దండేపల్లి మండలం వెల్గనూరులో 45.3, కోటపల్లి మండలం దేవులవాడలో 45.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదుకాగా వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. జన్నారం మండలంలో 44.9 డిగ్రీలు, భీమిని, కోటపల్లి మండలం కొల్లూరు, జైపూర్ మండలం కుందారంలో 44.6 డిగ్రీలు, లక్షెట్టిపేట మండలం శాంతాపూర్, నస్పూర్ మండలంలో 44.3, మందమర్రి మండలం అందుగులపేటలో 44.2, నెన్నెల మండలంలో 44.1, కన్నెపల్లి మండలంలో 43.9, తాండూరు మండలంలో 43.6 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Updated Date - May 30 , 2024 | 10:35 PM