ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఆటో డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలి

ABN, Publish Date - Apr 25 , 2024 | 11:07 PM

ఆటో డ్రైవర్ల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని, ఆటోలకు గిరాకీలు లేక ఫైనాన్స్‌లు కట్టలేక ఆత్మహత్య చేసు కున్న ఆటో డ్రైవర్ల కుటుంబాలకు రూ.25 లక్షలు చెల్లించాలని గురువారం తహసీల్దార్‌, మున్సిపల్‌ కమిషనర్‌కు ఆటో యూనియన్‌ నాయకులు వినతి పత్రాలు అందించారు.

మందమర్రిటౌన్‌, ఏప్రిల్‌ 25: ఆటో డ్రైవర్ల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని, ఆటోలకు గిరాకీలు లేక ఫైనాన్స్‌లు కట్టలేక ఆత్మహత్య చేసు కున్న ఆటో డ్రైవర్ల కుటుంబాలకు రూ.25 లక్షలు చెల్లించాలని గురువారం తహసీల్దార్‌, మున్సిపల్‌ కమిషనర్‌కు ఆటో యూనియన్‌ నాయకులు వినతి పత్రాలు అందించారు. ఆటో యూనియన్‌ నాయకులు మేడి రాజు, దాసరి కుమార్‌, బండారి మల్లేష్‌లు మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహాలక్ష్మీ పథకం ప్రవేశపెట్టడంతో ఆటోలకు గిరాకీలు లేకుండా పోయాయన్నారు. ఆటో డ్రైవర్లకు నెలకు రూ.12 వేలు చెల్లించాలని, ఆటో కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆటో డ్రైవర్లు మృతి చెందితే రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, 50 సంవత్సరాలు నిండిన వారికి పింఛన్‌ ఇవ్వాలని, ఫైనాన్స్‌ల వారి వేదింపులను అరికట్టాలన్నారు. గౌస్‌, కుమార్‌, శ్రీనివాస్‌, షరీఫ్‌, శ్రీను, గౌస్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 25 , 2024 | 11:07 PM

Advertising
Advertising