ఎన్నికల విధులు బాధ్యతగా నిర్వహించాలి
ABN, Publish Date - Apr 29 , 2024 | 10:24 PM
పెద్దపల్లి పార్లమెంట్ నియో జకవర్గ పరిధిలోని జిల్లాలో జరిగే లోక్‌సభ ఎన్నికల విధులను అధికారులు బాధ్యతగా నిర్వర్తించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో ఎన్నికల అధికారులకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ రాహుల్, మోతిలాల్‌లతో కలిసి హాజరై మాట్లాడారు.
మంచిర్యాల కలెక్టరేట్, ఏప్రిల్ 29: పెద్దపల్లి పార్లమెంట్ నియో జకవర్గ పరిధిలోని జిల్లాలో జరిగే లోక్‌సభ ఎన్నికల విధులను అధికారులు బాధ్యతగా నిర్వర్తించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో ఎన్నికల అధికారులకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ రాహుల్, మోతిలాల్‌లతో కలిసి హాజరై మాట్లాడారు. ఎన్నికలకు సంబంధించిన ప్రతి అంశంపై అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి పొరపాట్లు లేకుండా విధులను నిర్వహించాలన్నారు. పోలింగ్ రోజు ఎలక్ర్టానిక్ ఓటింగ్ యంత్రాల విషయంలో ఇబ్బందులు తలెత్తితో వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో మొత్తం 741 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఎన్నికల అధికారులు వారి పరిధిలోని పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. మే 13న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్ ఉంటుందన్నారు. అనంతరం మాస్టర్ ట్రైనర్లు హరికృష్ణ, మధులు బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీ ప్యాట్ల పని తీరుపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. కార్యక్ర మంలో ఆర్డీవో రాములు, ప్రత్యేక ఉప పాలన అధికారి చంద్రకళ, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Apr 29 , 2024 | 10:24 PM