ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

యువత వ్యసనాలకు అలవాటు కావద్దు

ABN, Publish Date - Jun 17 , 2024 | 10:42 PM

గ్రామీణ ప్రాంతాల యువత చెడు వ్యసనాలకు అలవాటు కాకుండా భవిష్యత్‌పై దృష్టి సారించాలని లక్షెట్టిపేట సీఐ నరేందర్‌ అన్నారు.

లక్షెట్టిపేటరూరల్‌, జూన్‌ 17: గ్రామీణ ప్రాంతాల యువత చెడు వ్యసనాలకు అలవాటు కాకుండా భవిష్యత్‌పై దృష్టి సారించాలని లక్షెట్టిపేట సీఐ నరేందర్‌ అన్నారు. సోమవారం జెండా వెంకటా పూర్‌, వెంకట్రావుపేట, చందారం, హన్మంతుపల్లి గ్రామాల్లోని యువకులకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో క్రీడా కిట్‌లను అందజేశారు. సీఐ మాట్లాడుతూ కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా గ్రామీణ ప్రాం తాల్లో పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నామ న్నారు. యువత చదువుతోపాటు క్రీడల్లో రాణించా లన్నారు. క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుంద న్నారు. ఎస్‌ఐ చంద్రకుమార్‌, పాల్గొన్నారు.

దండేపల్లి: గ్రామీణ ప్రాంతాలలో యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని ఎస్సై భూమేష్‌ అన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా తాని మడుగు, బెహరన్‌గూడ, రాజుగూడ, అర్జుగూడ గిరిజన గ్రామాల యువకులకు సోమవారం క్రీడా సామగ్రిని పోలీసుస్టేషన్‌లో అందజేశారు. ఎస్సై మాట్లాడుతూ దేశ భవిష్యతుకు కేంద్ర బిందువు యువత అన్నారు. విద్యార్ధులు, యువత చెడు అల వాట్లకు దూరంగా ఉండి చదువుపై దృష్టి పెట్టి ఉన్నత స్ధాయిలో నిలిచి తల్లిదండ్రుల పేరు నిల బెట్టాలన్నారు. అనంతరం సైబర్‌ నేరాలపై అవ గాహన కల్పించారు. పోలీసు, సిబ్బంది, యువకు లు పాల్గొన్నారు.

భీమిని: యువకులు వ్యసనాలకు దూరంగా ఉం డి మంచి మార్గంలో నడిచి తమ బంగారు భవిష్య త్తును తీర్చిదిద్దుకోవాలని ఎస్సై విజయ్‌ కుమార్‌ సూచించారు. రామగుండం సీపీ ఆదేశాల మేరకు పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా ఖర్జిభీంపూర్‌, చిన్నగుడిపేట గ్రామాల్లో సోమవారం యువతకు వాలీబాల్‌ కిట్స్‌ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో యువకులు పోలీసులు పాల్గొన్నారు.

Updated Date - Jun 17 , 2024 | 10:42 PM

Advertising
Advertising