సర్వే నంబరు 42లో భూ సర్వే ప్రారంభం
ABN, Publish Date - Jun 28 , 2024 | 10:33 PM
నస్పూర్‌లోని సర్వే నంబరు 42లో భూమి లెక్కను తేల్చడానికి అధికారులు శ్రీకారం చుట్టారు. దీంతో కబ్జాదారుల్లో గుబులు మొదలైంది.
నస్పూర్, జూన్ 28: నస్పూర్‌లోని సర్వే నంబరు 42లో భూమి లెక్కను తేల్చడానికి అధికారులు శ్రీకారం చుట్టారు. దీంతో కబ్జాదారుల్లో గుబులు మొదలైంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు భూ సర్వే, కొలతల శాఖ ఏడీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో శుక్రవారం నలుగురు సర్వేయర్లతో ప్రారంభిం చారు. నస్పూర్ శివారులోని 42 సర్వే నంబరులో 102.10 ఎకరాల భూమి ఉన్నది. ఇందులో ప్రభుత్వ అవసరాలకు, కొందరికి ఇళ్ళ స్థలాలు, రైతులకు అసైన్డ్ చేయగా మిగులు భూమి దశల వారీగా అన్యాక్రాంతమైంది. దీనిని తేల్చడానికి అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. నిర్మించిన ఇళ్ళతో పాటు ఖాళీ స్థలాలు, రోడ్లు, నిర్మాణాల కొలతలు తీస్తున్నారు. డీఐ గం గాధర్, తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్‌ఐ మాంతయ్య, మున్సిపల్ టీపీఎస్ సతీ ష్, సర్వేయర్లు, రెవెన్యూ, మున్సిపల్ బిల్లు కలెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
సర్వే నంబరు 42లో కలెక్టరేట్ నిర్మాణంతో అక్రమార్కుల కన్ను ఈ భూమి పడింది. రెవెన్యూ అధికారులపై రాజకీయ ఒత్తిళ్ళ కారణంగా ప్రభుత్వ భూములు కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లిందనే ఆరోపణలున్నాయి. అసైన్డ్‌దారుడిగా ఉన్న కొందరు గతంలోనే భూమిని మరొకరికి విక్రయించి తిరిగి ఆ కాగితాలనే చూపించి మరో చోట కబ్జాలకు పాల్పడినట్లు తెలు స్తోంది. కోట్ల విలువైన భూములను దక్కించుకోవడానికి కబ్జాదారులు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. తాజాగా భూమిని కొలతలు తీసి మిగు లు భూమితేల్చాలని నిర్ణయించడంతో కబ్జాదారుల్లో ఆందోళన మొదలైంది.
Updated Date - Jun 28 , 2024 | 10:33 PM