ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

పోలింగ్‌ సరళిపైనా విశ్లేషణ

ABN, Publish Date - May 14 , 2024 | 10:51 PM

నిన్నటి వరకు క్షణం తీరిక లేకుండా గడిపిన ఎంపీ అభ్యర్థులు మంగళవారం రిలాక్స్‌ అయ్యారు. లోక్‌సభ ఎన్నికల సందడి ముగియడంతో ప్రధాన పార్టీలై కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గడ్డం వంశీకృష్ణ, శ్రీనివాస్‌ గొమాసే, కొప్పుల ఈశ్వర్‌ ఇళ్లకే పరిమితమయ్యారు.

మంచిర్యాల, మే 14 (ఆంధ్రజ్యోతి): నిన్నటి వరకు క్షణం తీరిక లేకుండా గడిపిన ఎంపీ అభ్యర్థులు మంగళవారం రిలాక్స్‌ అయ్యారు. లోక్‌సభ ఎన్నికల సందడి ముగియడంతో ప్రధాన పార్టీలై కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గడ్డం వంశీకృష్ణ, శ్రీనివాస్‌ గొమాసే, కొప్పుల ఈశ్వర్‌ ఇళ్లకే పరిమితమయ్యారు.

సన్నిహితులతో మాటామంతి

ఎలక్షన్‌ ప్రక్రియ ముగియడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు సన్నిహితులతో కాలక్షేపం చేశారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ గోదావరిఖనిలోని ఆయన నివాసంలో విశ్రాంతి తీసకున్నారు. ముఖ్య కార్యకర్తలు కొందరితో ఎన్నికల్లో ఓటింగ్‌ జరిగిన తీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హైటెక్‌సిటీలో గల తన ఇంటికే పరిమితమయ్యారు. తండ్రి, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్‌తో సమాలోచనలు చేశారు. తల్లిదండ్రులతో కలిసి తన తాత దివంగత ఎంపీ, కాకా వెంకటస్వామి చిత్రం పటం వద్ద చిరునవ్వులు చిందిస్తూ గెలుపు ధీమాతో గడిపారు. బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్‌ గొమాసే సైతం ఇంటికే పరిమితమయ్యారు. జిల్లా కేంద్రంలోని గౌతమినగర్‌లో కుటుంబ సభ్యులతో గడిపారు.

పోలింగ్‌ సరళిపైనా విశ్లేషణ...

ముగ్గురు అభ్యర్థులు పోలింగ్‌ సరళిపై ముఖ్య కార్యకర్తలు, సన్నిహి తులతో విశ్లేషించారు. ఇళ్ల వద్దనే ముఖ్య నాయకులతో సమాలోచనలు చేశారు. ఏయే ఏరియాలో తమకు ఎన్ని ఓట్లు వస్తాయో నియోజక వర్గాల వారీగా లెక్కలు తీస్తూ ఓ అంచనాకు వచ్చే ప్రయత్నం చేశారు.

Updated Date - May 14 , 2024 | 10:52 PM

Advertising
Advertising