ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నాణ్యత పాటించకపోతే చర్యలు తప్పవు

ABN, Publish Date - Aug 24 , 2024 | 11:17 PM

విద్యార్థులు తినే ఆహార పదార్థాలు కూరగాయలు, కిరాణసామగ్రి నాణ్యమైనవి మాత్రమే వాడాలని లేదంటే చర్యలు తప్పవని పీయూ హాస్టల్‌ సిబ్బందిని పీయూ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ మధుసూదన్‌ రెడ్డి హెచ్చరించారు.

పీయూ బాలుర హాస్టల్‌లో కూరగాయలను పరిశీలిస్తున్న పీయూ రిజిస్ర్టార్‌ డాక్టర్‌ మధుసూదన్‌ రెడ్డి

- పీయూ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ మధుసూదన్‌ రెడ్డి

పాలమూరు యూనివర్సిటీ, ఆగస్టు 24 : విద్యార్థులు తినే ఆహార పదార్థాలు కూరగాయలు, కిరాణసామగ్రి నాణ్యమైనవి మాత్రమే వాడాలని లేదంటే చర్యలు తప్పవని పీయూ హాస్టల్‌ సిబ్బందిని పీయూ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ మధుసూదన్‌ రెడ్డి హెచ్చరించారు. శనివారం పాలమూరు యూనివర్సిటీలోని బాలికల హాస్టల్‌, పీజీ బాలుర హాస్టల్‌, ఫార్మసి హాస్టల్‌ను యూనివర్సిటీ పీజీ కాలేజీలో వైస్‌ ప్రినిపాల్‌ డాక్టర్‌ కృష్ణయ్యతో కలిసి ఆకస్మిక తనిఖీ చేసి పరిశీలించారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని విద్యార్థులకు ఎలాంటి సీజనల్‌ వ్యాధుల బారీన పడకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచాలని, జాగ్రత్తలు పాటించాలని సూచించారు. విద్యార్థుకు ఎలాంటి అనారోగ్య పరిస్థితి వచ్చినా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. హాస్టల్‌ వార్డెన్లు, కేర్‌టేకర్స్‌ అందరు నాణ్యత విషయంలో జాగ్రత్త వహించాలని సూచించారు. కార్యక్రమంలో పీయూ హాస్టల్‌ వార్డెన్‌ కేర్‌టేకర్స్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Aug 24 , 2024 | 11:17 PM

Advertising
Advertising
<