ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

భూపాలపల్లిలో బస్టా్‌పలోకి దూసుకెళ్లిన లారీ

ABN, Publish Date - May 12 , 2024 | 05:45 AM

ఇసుక లారీ అదుపు తప్పి బస్టా్‌పలో బస్సు కోసం వేచిచూస్తున్న వారిపైకి దూసుకెళ్లింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. భూపాలపల్లి లోని మంజూర్‌నగర్‌లో

ఇద్దరి మృతి.. మరో ఇద్దరి పరిస్థితి విషమం

కృష్ణకాలనీ (భూపాలపల్లి), మే 11: ఇసుక లారీ అదుపు తప్పి బస్టా్‌పలో బస్సు కోసం వేచిచూస్తున్న వారిపైకి దూసుకెళ్లింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. భూపాలపల్లి లోని మంజూర్‌నగర్‌లో సింగరేణి ఆస్పత్రి ఎదుట శనివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలం కాళేశ్వరం నుంచి ఇసుక లోడ్‌తో పరకాల వైపు వెళ్తున్న లారీ అదుపు తప్పి సింగరేణి ఆస్పత్రి ఎదుట ఉన్న బస్‌షెల్టర్‌ వద్ద ప్రయాణికులపైకి దూసుకెళ్లింది. ఏపీలోని విజయనగరం జిల్లా లక్ష్మీపురానికి చెందిన గవర ముసలనాయుడు (24), మహబూబ్‌నగర్‌ జిల్లా మూసిపేటకు చెందిన వాకటి సత్యనారాయ ణ (30) అక్కడిక్కడే మృతి చెందారు. వీరిద్దరూ భూపాలపల్లి జిల్లా గణపురం మం డలం బస్వరాజ్‌పల్లి సమీపంలోని సింగరేణిలో ఎస్వీ ఇంజనీరింగ్‌ కంపెనీలో డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. వీరితో పాటు మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ముసలనాయుడు, మరో వ్యక్తి సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు స్వస్థలాలకు వెళ్తూ ప్రమాదం బారిన పడినట్లు తెలిసింది.

Updated Date - May 12 , 2024 | 05:45 AM

Advertising
Advertising