ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Meta: వాట్సప్ సంచలనం.. ఏకంగా 76 లక్షల అకౌంట్ల తొలగింపు.. ఎందుకంటే

ABN, Publish Date - Apr 02 , 2024 | 01:39 PM

వినియోగదారుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇచ్చే వాట్సప్ తీసుకున్న ఓ నిర్ణయం సంచలనం సృష్టిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత్ కు చెందిన 76 లక్షలకుపైగా అకౌంట్లను వాట్సప్ నిషేధించింది. ఫిబ్రవరి 1 నుంచి 29 మధ్య కాలంలో 76,28,000 వాట్సప్ అకౌంట్లను నిషేధించింది.

న్యూయార్క్: వినియోగదారుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇచ్చే వాట్సప్ తీసుకున్న ఓ నిర్ణయం సంచలనం సృష్టిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత్ కు చెందిన 76 లక్షలకుపైగా అకౌంట్లను వాట్సప్ నిషేధించింది. ఫిబ్రవరి 1 నుంచి 29 మధ్య కాలంలో 76,28,000 వాట్సప్ అకౌంట్లను నిషేధించింది.

మెటా ప్రకటించిన నెలవారీ నివేదికలో ఈ విషయం తేటతెల్లమైంది. వీటిలో 14 లక్షలకుపైగా ఖాతాలను వినియోగదారులకు సమాచారం అందించకుండానే తొలగించారు. దేశంలో 500 మిలియన్లకు పైగా వినియోగదారులను కలిగి ఉన్న వాట్సప్ ఫిబ్రవరిలో దేశంలో రికార్డు స్థాయిలో 16,618 ఫిర్యాదులను అందుకుంది.


కొత్త ఐటీ రూల్స్, మెటా నిబంధనలు ఉల్లంఘించిన వారి అకౌంట్లనే తొలగించినట్లు యాజమాన్యం ప్రకటించింది. జనవరి 1 నుంచి 31వ తేదీల మధ్య మెటా.. 67,28,000 ఖాతాలను నిషేధించింది. ఈ ఖాతాల్లో దాదాపు 13,58,000 ఖాతాలు వినియోగదారుల నుంచి ఎలాంటి నివేదికలు రాకముందే ముందస్తుగా నిషేధించారు.

X Click here: ఎక్స్‌లో క్లిక్ హియర్ ట్రెండ్.. అసలేంటిది.. దీంట్లో మనమూ భాగస్వామ్యం కావొచ్చా

మెటా వివరణ ప్రకారం.. భద్రతా ఫీచర్లు, నియంత్రణలతో పాటు ఇతర ప్రయత్నాలను పర్యవేక్షించడానికి ఇంజినీర్లు, డేటా సైంటిస్టులు, విశ్లేషకులు, పరిశోధకులు, సాంకేతిక నిపుణుల బృందాన్ని నియమించామని చెప్పింది. వాట్సప్ లో కొత్త అప్ డేట్స్ తీసుకువస్తున్న మెటా త్వరలో అంతర్జాతీయ భారత వినియోగదారుల కోసం యూపీఐ అంతర్జాతీయ చెల్లింపుల ఫీచర్ ను అందుబాటులోకి తేనుంది. UPI ద్వారా అంతర్జాతీయ చెల్లింపులను ప్రారంభించడానికి WhatsApp కొత్త ఫీచర్‌పై పని చేస్తోందని గతంలోనే తెలిపింది.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 02 , 2024 | 01:42 PM

Advertising
Advertising