Sony Inzone Buds: మార్కెట్లోకి సోని కొత్త వైర్‌లెస్ ఇయర్ బడ్స్..ఏకంగా 24 గంటలపాటు!
ABN, Publish Date - Jan 19 , 2024 | 08:10 PM
టెక్ ప్రియులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. శుక్రవారం కొత్తగా Sony INZONE Buds దేశీయ మార్కెట్లోకి వచ్చాయి. అయితే వీటి ధర ఎంత, ఫీచర్లు ఎలా ఉన్నాయనే వివరాలను ఇప్పుడు చుద్దాం.
టెక్ ప్రియులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. శుక్రవారం కొత్తగా Sony INZONE Buds దేశీయ మార్కెట్లోకి వచ్చాయి. అయితే వీటిని ప్రధానంగా గేమింగ్ ప్రియులతోపాటు మంచి సౌండ్ క్వాలిటీని కోరుకునే వినియోగదారుల కోసం ఈ బడ్స్‌ను పరిచయం చేశారు. ఇన్ ఇయర్ డిజైన్, రబ్బర్‌తో లభిస్తున్న ఈ బడ్స్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) సౌకర్యంతో వస్తున్నాయి.
ఇవి గేమింగ్ సమయంలో 12 గంటల బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తాయని సోనీ సంస్థ తెలిపింది. సాధారణంగా ఉపయోగిస్తే ఇది 24 గంటల బ్యాకప్ వస్తుందని చెప్పింది. ఛార్జింగ్ కోసం USB సీ పోర్ట్ సౌకర్యాలతో లభిస్తున్నాయి. ఇక దీని ధర రూ.17,990గా ప్రకటించారు. వీటిని జనవరి 22 నుంచి భారతదేశంలోని సోనీ రిటైల్ స్టోర్‌లు లేదా ఈ కామర్స్ సైట్లు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ నుంచి కొనుగోలు చేయవచ్చు. ఇవి స్టైలిష్ వైట్, టైమ్‌లెస్ బ్లాక్ వంటి రెండు రంగులలో అందుబాటులో ఉన్నాయి.
Sony INZONE Buds మరిన్ని ఫీచర్లు
-ఇది మంచి సౌండ్ క్వాలిటీని నిర్ధారించడానికి 30ms వరకు తక్కువ లేటెన్సీ రేట్‌ను కలిగి ఉంది
-ఆడియో ట్రాన్స్‌మిషన్ కోసం LC3 కోడెక్ బ్లూటూత్‌తో లభిస్తుంది
-గేమింగ్ అనుభవం కోసం స్పేషియల్ ఆడియో సపోర్ట్ కూడా ఉంది
-8.4mm డ్రైవర్స్ ప్యాక్, L1 చిప్ సెట్ బ్లూటూత్ LE ఆడియో కనెక్షన్ ఫీచర్లు కలవు
Updated Date - Jan 19 , 2024 | 08:11 PM