ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Phone Hacking: మీ ఫోన్‌లో ఈ తేడాలు కనిపిస్తే హ్యాక్ అయినట్లే.. వెంటనే ఇలా చేయండి..!

ABN, Publish Date - Feb 29 , 2024 | 09:29 AM

Smart Phone Hack: ప్రస్తుత టెక్ యుగంలో.. టెక్నాలజీ(Technology) దినదినాభివృద్ధి చెందుతోంది. మనుషులు ఊహించలేని స్థాయిలో, ప్రపంచాన్నే అబ్బురపరిచే కొత్త కొత్త ఆవిష్కరణలు(Innovations) వస్తున్నాయి. అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో ఎన్ని ప్రయోజనాలు(Technology Benefits) ఉన్నాయో.. అంతకు మించిన నష్టాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా కొందరు కేటుగాళ్లు తమ స్వార్థ ప్రయోజనాల కోసం టెక్నాలజీని దుర్వినియోగం చేస్తున్నారు.

Smart Phone Hacking

Smart Phone Hack: ప్రస్తుత టెక్ యుగంలో.. టెక్నాలజీ(Technology) దినదినాభివృద్ధి చెందుతోంది. మనుషులు ఊహించలేని స్థాయిలో, ప్రపంచాన్నే అబ్బురపరిచే కొత్త కొత్త ఆవిష్కరణలు(Innovations) వస్తున్నాయి. అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో ఎన్ని ప్రయోజనాలు(Technology Benefits) ఉన్నాయో.. అంతకు మించిన నష్టాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. కొందరు కేటుగాళ్లు తమ స్వార్థ ప్రయోజనాల కోసం టెక్నాలజీని దుర్వినియోగం చేస్తున్నారు. అందినకాడికి దోచేసుకుంటున్నారు.

మొబైల్(Smart Phone) చేతిలో ఉంటే చాలు.. అన్ని పనులు చేసుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ ట్రాన్స్‌ఫర్ మొదలు.. షాపింగ్, బిల్ పేమెంట్స్, ప్రభుత్వ పథకాలకు అప్లికేషన్స్, డాక్యూమెంట్స్, స్టడీ.. ఇలా ఒకటేమిటి అన్ని పనులకు మొబైల్ ఉపకరిస్తుంది. అయితే, ఆ మొబైలే ప్రజల కొంప ముంచుతోంది. సైబర్ నేరగాళ్లు ప్రజల మొబైల్స్ హ్యాక్ చేసి.. వారి పర్సనల్ విషయాలతో పాటు, అకౌంట్లలోని డబ్బులను కూడా కాజేస్తున్నారు. అసలు మొబైల్ హ్యాక్(Mobile Hacking) అయిన విషయం కూడా కొందరు ప్రజలకు తెలియదు. అందుకే.. ఇవాళ మీకోసం కీలక వివరాలు తీసుకొచ్చాం. ఒకవేళ మీ మొబైల్ హ్యాక్ అయినట్లే కొన్ని లక్షణాలు మీ మొబైల్‌లో కనిపిస్తాయి. అవి గనుక మీ మొబైల్‌లో కనిపిస్తే.. వెంటనే అలర్ట్ అవ్వాల్సి ఉంటుంది. లేదంటే తీవ్ర నష్టం తప్పదు.

అకస్మాత్తుగా ఫోన్ స్లో అవుతుంది..

మొబైల్ హ్యాక్ అయ్యిందని గుర్తించడంలో ఇది చాలా కీలక సంకేతం. మీ స్మార్ట్ ఫోన్ అకస్మాత్తుగా స్లో అయినట్లయితే వెంటనే అలర్ట్ అవ్వాలి. హ్యాక్ అయిన సమయంలో మొబైల్‌లోని అన్ని ప్రోగ్రామ్స్ ఒకేసారి పని చేస్తాయి. తద్వారా మొబైల్ స్లో అవుతుంది. ఇంటర్నెడ్ స్పీడ్ బాగానే ఉన్నప్పటికీ.. మీ ఫోన్‌లో ఇంటర్నెట్‌ సమస్యలు తలెత్తడం, డేటా వినియోగం అధికంగా ఉన్నట్లయితే అప్రమత్తం అవ్వాలి.

షట్ డౌన్ అవడం, ఆటోమాటిక్‌గా రీస్టార్ట్ అవడం..

మొబైల్ ఫోన్ పదే పదే ఆటోమాటిక్‌గా షట్ డౌన్ అవడం, ఆటోమాటిక్‌గా రీస్టార్ట్ అవుతున్నట్లయితే మీ మొబైల్ ఫోన్ హ్యాక్ అయ్యిందని భావించొచ్చు. అలాగే మీ ఫోన్‌ సెట్టింగ్స్‌, యాప్‌లు ఆటోమాటిక్‌గా మారుతున్నట్లయితే హ్యాకర్లు మీ మొబైల్‌ను హ్యాక్ చేసినట్లు భావించొచ్చు.

బ్యాటరీ డౌన్..

మీ ఫోన్‌లో బ్యాటరీ అకస్మాత్తుగా డ్రైన్ అయిపోతే కూడా ఫోన్ హ్యాక్ అయిందని గుర్తించాలి. ఫోన్ హ్యాక్ అయిన తరువాత హ్యాకర్లు చాలా మాల్వేర్, యాప్‌లు, డేటాను ప్రాసెస్ చేస్తారు. ఇందుకోసం బ్యాటరీ వినియోగం ఎక్కువ అవుతుంది. దాంతో బ్యాటర్ అకస్మాత్తుగా తగ్గిపోతుంది.

ఫోన్ హ్యాక్ అయితే ఏం చేయాలి..

ఒకవేళ మీ స్మార్ట్ ఫోన్ హ్యాక్ అయితే వెంటనే ఫార్మాట్ చేయాలి. పొరపాటున కూడా ఫోన్ బ్యాకప్ తీసుకోవద్దు. ఒకవేళ ఫోన్ బ్యాకప్ చేసుకుంటే.. బ్యాకప్ అయ్యే ఫైల్స్‌తో పాటు మాల్వేర్ కూడా వచ్చి ఫోన్‌లో మళ్లీ ఇన్‌స్టాల్ అవుతుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Feb 29 , 2024 | 10:50 AM

Advertising
Advertising