ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

IND vs AFG: అఫ్గాన్‌తో తొలి టీ-20కి కోహ్లీ దూరం.. కోచ్ రాహుల్ ద్రవిడ్ ఏం చెప్పాడంటే..

ABN, Publish Date - Jan 10 , 2024 | 07:41 PM

అఫ్గానిస్తాన్‌తో గురువారం నుంచి టీమిండియా మూడు మ్యాచ్‌ల టీ-20 సిరీస్ ఆడబోతోంది. ఈ మ్యాచ్‌లో యువ ఆటగాళ్లను కాదని సీనియర్లైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి బీసీసీఐ చోటు కల్పించింది. ఈ ఏడాది టీ-20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో సెలక్షన్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది.

అఫ్గానిస్తాన్‌తో గురువారం నుంచి టీమిండియా మూడు మ్యాచ్‌ల టీ-20 సిరీస్ ఆడబోతోంది (IND vs AFG T20 Series). ఈ మ్యాచ్‌లో యువ ఆటగాళ్లను కాదని సీనియర్లైన రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీ (Virat Kohli)కి బీసీసీఐ చోటు కల్పించింది. ఈ ఏడాది టీ-20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో సెలక్షన్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే గురువారం జరగబోయే తొలి మ్యాచ్‌కు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అందుబాటులో ఉండడం లేదు.

తొలి మ్యాచ్‌కు కోహ్లీ అందుబాటులో ఉండడని టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) తెలిపాడు. వ్యక్తిగత కారణాల వల్లే కోహ్లీ ఆ మ్యాచ్ ఆడడం లేదని అన్నాడు. కోహ్లీ భార్య అనుష్క శర్మ ప్రస్తుతం గర్భవతి అనే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భార్య, కూతురితో ఎక్కువ సమయం గడిపేందుకే కోహ్లీ తొలి మ్యాచ్‌ను మిస్ అవుతున్నాడని తెలుస్తోంది. రెండు, మూడో మ్యాచ్‌లకు మాత్రం కోహ్లీ అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

ఈ మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మలు బ్యాటింగ్‌‌ను ప్రారంభిస్తారని కోచ్ ద్రవిడ్ తెలిపాడు. స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ చివరిసారిగా 2022 టీ-20 ప్రపంచ కప్‌లో ఆడారు. ఆ ప్రపంచ కప్ సెమీ-ఫైనల్‌లో భారత్ ఓడిపోయింది. అప్పటి నుంచి ఈ దిగ్గజ ఆటగాళ్లు అంతర్జాతీయ టీ-20లకు దూరమై వన్డేలు, టెస్టులకే పరిమితమయ్యారు.

Updated Date - Jan 10 , 2024 | 07:41 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising