సిరియాదే టైటిల్
ABN, Publish Date - Sep 10 , 2024 | 03:14 AM
సొంతగడ్డపై జరిగిన ఇంటర్‌కాంటినెంటల్ కప్‌లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన భారత జట్టు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమిపాలై అభిమానులను...
0- 3తో ఓడిన భారత్ ఫ ఇంటర్‌కాంటినెంటల్ కప్
మంత్రి పొంగులేటికి ఆటగాళ్ల పరిచయం
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): సొంతగడ్డపై జరిగిన ఇంటర్‌కాంటినెంటల్ కప్‌లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన భారత జట్టు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమిపాలై అభిమానులను నిరాశపర్చింది. సోమవారం జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరిగిన తమ రెండో మ్యాచ్‌ను సిరియాతో ఆడిన బ్లూ టైగర్స్ 0-3తో చిత్తుగా ఓడింది. అంతకుముందు మ్యాచ్‌లో 2-0తో మారిష్‌సను చిత్తు చేసిన సిరియా ఆడిన రెండు మ్యాచ్‌లు నెగ్గి, ట్రోఫీని కైవసం చేసుకుంది. టీమిండియాతో మ్యాచ్‌లో ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన సిరియా అదే ఆధిపత్యాన్ని తుది వరకు చెలాయించింది. 7వ నిమిషంలోనే మొహమ్మద్, 77వ నిమిషంలో ఇరాన్‌డస్ట్, ఇంజ్యూరీ టైమ్‌లో పాబ్లో గోల్స్ సాధించారు.
ట్రోఫీ ప్రదానం చేసిన సీఎం రేవంత్..: విజేత సిరియా జట్టుకు సీఎం రేవంత్ రెడ్డి ట్రోఫీ ప్రదానం చేశారు. అంతకుముందు రాష్ట్ర సమాచారశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇరు జట్ల ఆటగాళ్లతో కరచాలనం చేసి, మ్యాచ్‌ను ప్రారంభించారు. ముగింపు వేడుకల్లో శాట్ చైర్మన్ శివసేనా రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ క్రీడాశాఖ సలహాదారులు ఏపీ జితేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Sep 10 , 2024 | 03:14 AM