ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సిన్నర్‌ డోపింగ్‌లో దొరికినా..!

ABN, Publish Date - Aug 21 , 2024 | 05:50 AM

ప్రపంచ టెన్నిస్‌ నెంబర్‌వన్‌ ఆటగాడు, ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ విజేత జానిక్‌ సిన్నర్‌ (ఇటలీ) రెండుసార్లు డోపింగ్‌లో పట్టుబడ్డాడు. కానీ, అతడిపై ప్రపంచ డోపింగ్‌ నిరోధక సంస్థ (నాడా) ఎలాంటి చర్యలూ తీసుకోలేదు...

కాలిఫోర్నియా (అమెరికా): ప్రపంచ టెన్నిస్‌ నెంబర్‌వన్‌ ఆటగాడు, ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ విజేత జానిక్‌ సిన్నర్‌ (ఇటలీ) రెండుసార్లు డోపింగ్‌లో పట్టుబడ్డాడు. కానీ, అతడిపై ప్రపంచ డోపింగ్‌ నిరోధక సంస్థ (నాడా) ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. గత మార్చిలో ఇండియన్‌ వెల్స్‌ టోర్నీ సందర్భంగా సిన్నర్‌ శాంపిల్‌లో నిషేధిత ఉత్ర్పేరకం క్లోస్టబోల్‌ ఆనవాళ్లు కనిపించాయి. అయితే, సిన్నర్‌ ఉద్దేశపూర్వకంగా డ్రగ్స్‌ తీసుకోలేదని స్వతంత్ర ట్రిబ్యునల్‌ పేర్కొనడంతో అతడిపై సస్పెన్షన్‌ విధించలేదు. అంతర్జాతీయ టెన్నిస్‌ ఇంటిగ్రిటీ ఏజెన్సీ (ఐటీఐఏ) మంగళవారం ఈ కేసు వివరాలను బహిర్గతం చేసింది. టాన్సిల్స్‌తో బాధపడుతున్న సిన్నర్‌ చికిత్సలో భాగంగా స్వల్పస్థాయిలో ఆ ఉత్ర్పేరకాన్ని వాడినట్టు తెలిపింది. మరోసారి అవుటాఫ్‌ కాంపిటీషన్‌ టెస్ట్‌లో కూడా పాజిటివ్‌గా రావడంతో తాత్కాలికంగా సస్పెండ్‌ చేశారు. కానీ, ఈనెల 15న విచారణలో గాయంపై స్ర్పేచేసే క్రమంలో ఆ డ్రగ్‌ అతడి బాడీలోకి ప్రవేశించిందనే వివరణపై సంతృప్తి చెందిన ఐటీఐఏ అతడిపై నిషేధాన్ని ఎత్తివేసింది.

Updated Date - Aug 21 , 2024 | 05:50 AM

Advertising
Advertising
<