ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రూ. 1.5 కోట్లా.. ఎప్పుడిచ్చారు?

ABN, Publish Date - Aug 14 , 2024 | 02:11 AM

పారిస్‌ ఒలింపిక్స్‌ సన్నద్ధత కోసం తనపై రూ. కోటిన్నరకు పైగా ఖర్చు చేసినట్టు భారత క్రీడా ప్రాథికార సంస్థ (సాయ్‌) తన నివేదికలో పేర్కొనడాన్ని బ్యాడ్మింటన్‌ డబుల్స్‌ ప్లేయర్‌ అశ్విని పొన్నప్ప తప్పుబట్టింది. తనకు అందిన...

సాయ్‌ నివేదికను తప్పుబట్టిన అశ్విని

న్యూఢిల్లీ: పారిస్‌ ఒలింపిక్స్‌ సన్నద్ధత కోసం తనపై రూ. కోటిన్నరకు పైగా ఖర్చు చేసినట్టు భారత క్రీడా ప్రాథికార సంస్థ (సాయ్‌) తన నివేదికలో పేర్కొనడాన్ని బ్యాడ్మింటన్‌ డబుల్స్‌ ప్లేయర్‌ అశ్విని పొన్నప్ప తప్పుబట్టింది. తనకు అందిన సహాయం స్వల్పమేనని తెలిపింది. ఆఖరికి కోచ్‌ కోసం తాను చేసిన అభ్యర్థనను కూడా తిరస్కరించారని చెప్పింది. తనీషా క్రాస్టోతో కలసి మహిళల డబుల్స్‌ బరిలో దిగిన పొన్నప్ప ఒక్క మ్యాచ్‌ కూడా గెలవకుండానే ఇంటిముఖం పట్టింది. అయితే, ఒలింపిక్‌ సైకిల్‌లో భాగంగా ఆమెకు ‘టాప్స్‌’ పథకం కింద రూ.4.5 లక్షలు, వార్షిక ట్రైనింగ్‌, పోటీల కింద రూ. 1.48 కోట్లను ఖర్చు చేసినట్టు సాయ్‌ తెలిపింది. ‘ఆ నివేదిక నన్ను షాక్‌కు గురి చేసింది. వ్యక్తిగతంగా నాకు ఆర్థిక సాయం చేశానని చెప్పడం హాస్యాస్పదం. నా కోచ్‌కు నేనే జీతాలు చెల్లించా. ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తర్వాతే నన్ను టాప్స్‌లో చేర్చార’ని పొన్నప్ప చెప్పింది.

Updated Date - Aug 14 , 2024 | 02:11 AM

Advertising
Advertising
<