ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

రెండు విడతలుగా రంజీ ట్రోఫీ

ABN, Publish Date - May 12 , 2024 | 02:09 AM

ఈ ఏడాది నుంచి దేశవాళీ క్రికెట్‌లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. దీనిలో భాగంగా రాహుల్‌ ద్రవిడ్‌, లక్ష్మణ్‌, అజిత్‌ అగార్కర్‌, బీసీసీఐ జీఎం అభయ్‌ కురువిల్లా నేతృత్వంలోని...

  • సీకే నాయుడులో టాస్‌ ఉండబోదు

  • దేశవాళీ క్రికెట్‌లో ప్రక్షాళన

న్యూఢిల్లీ: ఈ ఏడాది నుంచి దేశవాళీ క్రికెట్‌లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. దీనిలో భాగంగా రాహుల్‌ ద్రవిడ్‌, లక్ష్మణ్‌, అజిత్‌ అగార్కర్‌, బీసీసీఐ జీఎం అభయ్‌ కురువిల్లా నేతృత్వంలోని వర్కింగ్‌ గ్రూప్‌ తమ ప్రతిపాదనలను బోర్డు కార్యదర్శి జైషాకు సమర్పించింది. దీనిప్రకారం.. రంజీ ట్రోఫీ ఒకేసారి కాకుండా రెండు విడతలుగా నిర్వహించనున్నారు. అక్టోబరు రెండో వారం నుంచి ముందుగా ఐదు లీగ్‌ మ్యాచ్‌లు జరుగుతాయి. అంతేకాకుండా మ్యాచ్‌ల మధ్య నాలుగు రోజులపాటు విరామం ఉంటుంది. నవంబరు మధ్య నుంచి జనవరి ఆరంభం దాకా సయ్యద్‌ ముస్తాక్‌ అలీ, విజయ్‌ హజారే ట్రోఫీ పరిమిత ఓవర్ల మ్యాచ్‌లు జరుగుతాయి. ఇవి ముగిశాక రంజీ ట్రోఫీ చివరి రెండు లీగ్‌ రౌండ్లతో పాటు నాకౌట్‌ మ్యాచ్‌లు కూడా మార్చి తొలి వారం వరకు జరుగుతాయి. ఇదిలావుండగా సీకే నాయుడు ట్రోఫీలో ప్రయోగాత్మకంగా టాస్‌ను ఎత్తివేయనున్నారు. దీంతో పర్యాటక జట్టుకు తమ ఇష్టప్రకారం బ్యాటింగ్‌ లేదా బౌలింగ్‌ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇది సక్సెస్‌ అయితే రంజీల్లోనూ అమలు చేస్తారు.

Updated Date - May 12 , 2024 | 02:09 AM

Advertising
Advertising