ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

క్రికెట్‌లో నాకు నాన్నలా..

ABN, Publish Date - May 05 , 2024 | 03:20 AM

తన క్రికెట్‌ కెరీర్‌లో ఎంఎస్‌ ధోనీ తండ్రిలాంటి వారని శ్రీలంక యువ పేసర్‌ మతీష పతిరన అన్నాడు. మహీ ఇచ్చే చిన్నచిన్న సూచనలు తనకు ఎంతో ఆత్మవిశ్వాసాన్నిస్తాయని...

ధోనీపై సీఎ్‌సకే పేసర్‌ పతిరన

చెన్నై: తన క్రికెట్‌ కెరీర్‌లో ఎంఎస్‌ ధోనీ తండ్రిలాంటి వారని శ్రీలంక యువ పేసర్‌ మతీష పతిరన అన్నాడు. మహీ ఇచ్చే చిన్నచిన్న సూచనలు తనకు ఎంతో ఆత్మవిశ్వాసాన్నిస్తాయని చెప్పాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున పతిరన ఆకట్టుకొనే ప్రదర్శన చేస్తున్నాడు. ‘నా తండ్రి తర్వాత.. నా క్రికెట్‌ జీవితంలో ఆ పాత్రను పోషిస్తున్న వ్యక్తి ధోనీ. ఎల్లవేళలా నా గురించి జాగ్రత్తలు తీసుకొంటాడు. ఇంటి వద్ద నాన్న ఎలా సలహాలిస్తారో.. ఇక్కడ ధోనీ అలా..! మైదానంలో ఆడుతున్నప్పుడు పెద్దగా ఒత్తిడి చేయడు. అవసరమైన విషయాలు మాత్రమే సూటిగా చెబుతాడు. అవి నాలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయ’ని చెన్నై ఫ్రాంచైజీ యూట్యూబ్‌ చానెల్‌ షోలో పతిరన చెప్పాడు. ఏదైనా అనుమానం ఉన్నా, స్వేచ్ఛగా వెళ్లి అతడితో మాట్లాడతానన్నాడు. ధోనీ వచ్చే సీజన్‌లో కూడా తమతో కలసి ఆడాలని కోరుకుంటున్నట్టు 21 ఏళ్ల పతిరన తెలిపాడు.

Updated Date - May 05 , 2024 | 03:20 AM

Advertising
Advertising