ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

కివీస్‌ కథ ముగిసినట్టే!

ABN, Publish Date - Jun 14 , 2024 | 03:00 AM

గత టోర్నీ సెమీఫైనలిస్ట్‌ న్యూజిలాండ్‌.. టీ20 వరల్డ్‌కప్‌ తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టడం దాదాపు ఖాయమైంది. గ్రూప్‌-సిలో గురువారం తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో కివీస్‌ 13 పరుగుల తేడాతో వెస్టిండీస్‌ చేతిలో...

సూపర్‌-8కు వెస్టిండీస్‌

  • 13 పరుగులతో ఓటమి

  • రూథర్‌ఫోర్డ్‌ ధనాధన్‌ అర్ధ శతకం

  • జోసె్‌ఫకు 4 వికెట్లు

టరోబా (ట్రినిడాడ్‌): గత టోర్నీ సెమీఫైనలిస్ట్‌ న్యూజిలాండ్‌.. టీ20 వరల్డ్‌కప్‌ తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టడం దాదాపు ఖాయమైంది. గ్రూప్‌-సిలో గురువారం తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో కివీస్‌ 13 పరుగుల తేడాతో వెస్టిండీస్‌ చేతిలో చిత్తయింది. క్లిష్టసమయంలో షెర్ఫేన్‌ రూథర్‌ఫోర్డ్‌ (39 బంతుల్లో 68 నాటౌట్‌) అర్ధ శతకంతోపాటు బౌలర్లు చెలరేగడంతో.. విండీస్‌ సూపర్‌-8కు దూసుకెళ్లింది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి మొత్తం ఆరు పాయింట్లతో తర్వాతి దశకు అర్హత సాధించింది. కాగా, న్యూజిలాండ్‌ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమిపాలైంది. కివీస్‌ సూపర్‌-8కు చేరాలంటే...అఫ్ఘానిస్థాన్‌ జట్టు మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమిపాలవ్వాలి. అలాగే మైనస్‌ రన్‌రేట్‌తో ఉన్న కివీస్‌ భారీ విజయాలు సాధించాలి. ఇది దాదాపు అసాధ్యమనే చెప్పాలి. ఇప్పటికే భారీ రన్‌రేట్‌ (+5.225)తో ఉన్న అఫ్ఘాన్‌ జట్టు పసికూన పపువా న్యూ గినీ, వెస్టిండీ్‌సలతో ఆడాల్సివుంది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌ 20 ఓవర్లలో 149/9 స్కోరు చేసింది. న్యూజిలాండ్‌ పేసర్లు బౌల్ట్‌ (3/16), సౌథీ (2/21) విజృంభించడంతో.. విండీస్‌ 22/4తో పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో ఆరో నెంబర్‌లో బ్యాటింగ్‌కు దిగిన రూథర్‌ఫోర్డ్‌ ఎడాపెడా షాట్లతో కివీస్‌ బౌలింగ్‌ను ఉతికి ఆరేశాడు. చివరి రెండు ఓవర్లలో 19, 18 పరుగులు పిండుకొన్న రూథర్‌ఫోర్డ్‌ జట్టుకు పోరాడగలిగే స్కోరును అందించాడు. అనంతరం ఛేదనలో న్యూజిలాండ్‌ ఓవర్లన్నీ ఆడి 136/9 స్కోరు మాత్రమే చేసింది. ఫిలిప్స్‌ (40), ఫిన్‌ అలెన్‌ (26), శాంట్నర్‌ (21) కొంతసేపు పోరాడారు. అల్జారీ జోసెఫ్‌ (4/19) నాలుగు వికెట్లు, గుడకేష్‌ (3/25) మూడు వికెట్లతో కివీస్‌ బ్యాటింగ్‌ వెన్నువిరిచారు.


సంక్షిప్త స్కోర్లు

వెస్టిండీస్‌: 20 ఓవర్లలో 149/9 (రూథర్‌ఫోర్డ్‌ 68 నాటౌట్‌; బౌల్ట్‌ 3/16, సౌథీ 2/21). న్యూజిలాండ్‌: 20 ఓవర్లలో 136/9 (ఫిలిప్స్‌ 40, ఫిన్‌ అలెన్‌ 26; జోసెఫ్‌ 4/19, గుడకేష్‌ 3/25).

పాయింట్ల పట్టిక గ్రూప్‌-సి

జట్టు మ్యా గె ఓ ఫ.తే పా రన్‌రేట్‌

వెస్టిండీస్‌ 3 3 0 0 6 2.596

అఫ్ఘానిస్థాన్‌ 2 2 0 0 4 5.225

ఉగాండా 3 1 2 0 2 -4.217

పీఎన్‌ఏ 2 0 2 0 0 -0.434

న్యూజిలాండ్‌ 2 0 2 0 0 -2.425

ఆ: ఆడినవి; గె: గెల్చినవి; ఓ: ఓడినవి; పా: పాయింట్లు

Updated Date - Jun 14 , 2024 | 03:00 AM

Advertising
Advertising