ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఫైనల్లో జ్యోతి సురేఖ జట్టు

ABN, Publish Date - Apr 25 , 2024 | 03:09 AM

వరల్డ్‌కప్‌ కాంపౌండ్‌ ఆర్చరీలో జ్యోతి సురేఖ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. పురుషుల టీమ్‌ కూడా తుది పోరుకు చేరుకొంది. మరోవైపు రికర్వ్‌ విభాగం క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో ధీరజ్‌ బొమ్మదేవర...

  • పురుషుల టీమ్‌ కూడా..

  • ఆర్చరీ వరల్డ్‌కప్‌

షాంఘై: వరల్డ్‌కప్‌ కాంపౌండ్‌ ఆర్చరీలో జ్యోతి సురేఖ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. పురుషుల టీమ్‌ కూడా తుది పోరుకు చేరుకొంది. మరోవైపు రికర్వ్‌ విభాగం క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో ధీరజ్‌ బొమ్మదేవర జాతీయ రికార్డుతో మెయిన్‌ కాంపిటీషన్‌కు అర్హత సాధించాడు. బుధవారం జరిగిన కాంపౌండ్‌ సెమీ్‌సలో సురేఖ, అదితి గోపీచంద్‌, పర్ణీత్‌ కౌర్‌లతో కూడిన భారత జట్టు 235-230తో ఎస్తోనియా టీమ్‌పై గెలిచింది. శనివారం జరిగే ఫైనల్లో ఇటలీతో వరల్డ్‌ చాంప్‌ భారత్‌ తలపడనుంది. కాగా, అభిషేక్‌ వర్మ, ప్రియాన్ష్‌, ప్రథమే్‌షలతో కూడిన పురుషుల జట్టు 235-233తో కొరియా జట్టుపై నెగ్గింది. స్వర్ణ పతక పోరులో నెదర్లాండ్స్‌తో టీమిండియా తలపడనుంది. పురుషుల రికర్వ్‌ వ్యక్తిగత విభాగం అర్హత రౌండ్‌లో ధీరజ్‌ 693 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి.. ప్రధాన పోటీకి అర్హత సాధించాడు. ఈ క్రమంలో తరుణ్‌దీప్‌ రాయ్‌ (689 పాయింట్లు) జాతీయ రికార్డును ధీరజ్‌ అధిగమించాడు.

Updated Date - Apr 25 , 2024 | 03:09 AM

Advertising
Advertising