ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

IPL 2024: బుమ్రా వేసిన సూపర్ యార్కర్ చూశారా? ఆ బాల్ ఆడడం ఎవరికైనా కష్టమే.. వీడియో వైరల్!

ABN, Publish Date - Apr 19 , 2024 | 04:45 PM

ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ ఐపీఎల్‌లో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. వేరెవరికీ సాధ్యం కాని రీతిలో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేస్తున్నాడు. అంతేకాదు తన ట్రేడ్‌మార్క్ యార్కర్లతో వికెట్లు తీస్తున్నాడు. పరుగులను నియంత్రిస్తున్నాడు.

ముంబై ఇండియన్స్ (MI) స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ఈ ఐపీఎల్‌లో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. వేరెవరికీ సాధ్యం కాని రీతిలో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేస్తున్నాడు. అంతేకాదు తన ట్రేడ్‌మార్క్ యార్కర్లతో వికెట్లు తీస్తున్నాడు. పరుగులను నియంత్రిస్తున్నాడు. తాజాగా ముల్లాన్‌పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో ముంబై ఇండియన్స్ (PBKS vs MI) టీమ్ తలపడింది. ఈ మ్యాచ్‌లో బుమ్రా వేసిన ఓ బంతి క్రికెట్ దిగ్గజాలను సైతం నివ్వెరపరిచింది (IPL 2024).


పంజాబ్ ఇన్సింగ్స్ రెండో ఓవర్లో బుమ్రా వేసిన మూడో బంతికి రిలే రూసో వద్ద సమాధానం లేకుండా పోయింది. అమిత వేగంతో బుమ్రా వేసిన అద్భుతమైన ఇన్‌స్వింగింగ్ యార్కర్ రూసో వికెట్లను గిరాటేసింది. రూసో బ్యాట్ పెట్టే లోపే బంతి వికెట్లను తాకింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది సూపర్ బాల్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేశాడు. ఈ మ్యాచ్‌లో బుమ్రా అద్భుత ప్రదర్శన కనబరిచాడు.


బుమ్రా ఈ మ్యాచ్‌లో మొత్తం 4 ఓవర్లు వేసి 21 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. ఇక, వరుస పరాజయాలతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్‌కు ఈ మ్యాచ్ ద్వారా కాస్త ఊరట దక్కింది. 9 పరుగుల తేడాతో గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 7 వికెట్లకు 192 పరుగులు చేసింది. సూర్యకుమార్‌ (78), రోహిత్‌ (36), తిలక్‌ (34 నాటౌట్‌) రాణించారు. ఛేదనలో పంజాబ్‌ 19.1 ఓవర్లలో 183 పరుగులు చేసి ఓడింది. బుమ్రా, కొట్జీలకు మూడేసి వికెట్లు దక్కాయి.

ఇవి కూడా చదవండి..

IPL match: రేపు ఐపీఎల్‌ మ్యాచ్‌ టిక్కెట్ల విక్రయం


T20 World Cup: టీ20 వరల్డ్‌కప్.. భారత వికెట్ కీపర్‌గా అతడు కన్ఫమ్?


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 19 , 2024 | 04:45 PM

Advertising
Advertising