Share News

T20 World Cup: టీ20 వరల్డ్‌కప్.. భారత వికెట్ కీపర్‌గా అతడు కన్ఫమ్?

ABN , Publish Date - Apr 18 , 2024 | 02:13 PM

టీ20 వరల్డ్‌కప్ సమీపిస్తున్న తరుణంలో.. భారత జట్టులో ఎవరెవరు స్థానం పొందుతారు? అనే ఉత్కంఠ పెరుగుతూ వస్తోంది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో భారత ఆటగాళ్ల ప్రదర్శనను చూసి.. జట్టుని ఫైనల్ చేసే అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి. ఇప్పటికే రోహిత్ శర్మ్ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తిస్తుండగా..

T20 World Cup: టీ20 వరల్డ్‌కప్.. భారత వికెట్ కీపర్‌గా అతడు కన్ఫమ్?

టీ20 వరల్డ్‌కప్ (T20 World Cup) సమీపిస్తున్న తరుణంలో.. భారత జట్టులో ఎవరెవరు స్థానం పొందుతారు? అనే ఉత్కంఠ పెరుగుతూ వస్తోంది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో భారత ఆటగాళ్ల ప్రదర్శనను చూసి.. జట్టుని ఫైనల్ చేసే అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి. ఇప్పటికే రోహిత్ శర్మ్ (Rohit Sharma) కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తిస్తుండగా.. తాజాగా అతడు చేసిన వ్యాఖ్యలతో ఓ ప్లేయర్ వికెట్ కీపర్‌గా కన్ఫమ్ అయినట్టేనని అంతా అనుకుంటున్నారు. ఇంతకీ ఆ ప్లేయర్ ఎవరనుకుంటున్నారా? మరెవ్వరో కాదు.. రిషభ్ పంత్ (Rishabh Pant).

ఎయిర్‌పోర్టులో దూరి ఆ పని చేసిన యూట్యూబర్.. అడ్డంగా బుక్


‘క్లబ్‌ ప్రైరీ ఫైర్ పాడ్‌కాస్ట్‌’లో భాగంగా మాజీ క్రికెటర్లు మైకేల్‌ వాన్‌, ఆడం గిల్‌‌క్రిస్ట్‌లతో సరదాగా ముచ్చటించిన రోహిత్ శర్మ.. ఈ సందర్భంగా రిషభ్ పంత్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పంత్ ఒక క్రేజీ ప్లేయర్ అని.. సాధారణంగా యువ ఆటగాళ్లంతా క్రేజీగానే ఉంటారు కానీ.. పంత్ మాత్రం మరింత క్రేజీ అని పేర్కొన్నాడు. తానెప్పుడైనా ముభావంగా ఉన్నప్పుడు.. పంత్ తనదైన చిలిపి చేష్టలు, జోక్‌లతో నవ్వించడానికి ప్రయత్నిస్తాడని చెప్పాడు. అతడు పిల్లాడిగా ఉన్ననాటి నుంచి తాను చూస్తున్నానని.. కానీ గతేడాది జరిగిన దుర్ఘటన కారణంగా ఏడాదిన్నర పాటు ఆటకు దూరం కావడం చాలా బాధగా అనిపించిందని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే.. ఇప్పుడు అతను తిరిగి రావడం చాలా సంతోషంగా ఉందని.. గాయాల నుంచి కోలుకొని కెప్టెన్‌గా, వికెట్ కీపర్‌గా అదరగొడుతున్నాడని కొనియాడాడు. టీ20 వరల్డ్‌కప్ కోసం పంత్ టీమిండియాలో ఉండాలని తాను కోరుకుంటున్నానని అభిప్రాయపడ్డాడు. దీంతో.. వికెట్ కీపర్‌గా పంత్ దాదాపు కన్ఫమ్ అయినట్టేనని అందరూ భావిస్తున్నారు.

అవన్నీ పచ్చి అబద్ధాలు అంటూ క్లారిటీ ఇచ్చిన రోహిత్ శర్మ

ఇదే సమయంలో.. భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై (MS Dhoni) కూడా రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్‌-2024లో అదరగొడుతున్న ధోనీని టీ20 వరల్డ్‌కప్‌లో ఆడేందుకు ఒప్పించడం చాలా కష్టమేనని తేల్చి చెప్పాడు. ప్రస్తుతం అతడు అనారోగ్యంతో ఉన్నాడని, బాగా అలసిపోయాడని అన్నాడు. అయినప్పటికీ ధోనీ అమెరికాకు రావడం పక్కా అని తెలిపాడు. కానీ.. అక్కడ గోల్ఫ్ ఆడేందుకు మాత్రమే వస్తాడని, ఈమధ్య కాలంలో ధోనీ గోల్ఫ్‌పైనే ఎక్కువగా దృష్టి పెట్టాడని చెప్పుకొచ్చాడు. ఇక మరో వెటరన్‌ ప్లేయర్‌, వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తిక్‌ (Dinesh Karthik) గురించి ప్రస్తావిస్తూ.. అతడ్ని వరల్డ్‌కప్‌లో ఆడేలా కన్విన్స్‌ చేయడం చాలా సులభమని సరదాగా కామెంట్ చేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 18 , 2024 | 02:14 PM