Share News

Rohit Sharma: అవన్నీ పచ్చి అబద్ధాలు అంటూ క్లారిటీ ఇచ్చిన రోహిత్ శర్మ

ABN , Publish Date - Apr 18 , 2024 | 12:28 PM

టీ20 వరల్డ్‌కప్ సమీపిస్తున్న తరుణంలో.. భారత జట్టు గురించి చర్చించేందుకు కెప్టెన్ రోహిత్ శర్మ కొన్ని రోజుల క్రితం బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌ని కలిశాడని వార్తలు వచ్చాయి.

Rohit Sharma: అవన్నీ పచ్చి అబద్ధాలు అంటూ క్లారిటీ ఇచ్చిన రోహిత్ శర్మ
Rohit Sharma Dismisses Reports Of T20 World Cup Selection Meeting

టీ20 వరల్డ్‌కప్ (T20 World Cup) సమీపిస్తున్న తరుణంలో.. భారత జట్టు గురించి చర్చించేందుకు కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) కొన్ని రోజుల క్రితం బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar), టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌ని (Rahul Dravid) కలిశాడని వార్తలు వచ్చాయి. అయితే.. ఈ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని రోహిత్ క్లారిటీ ఇచ్చాడు. తాను ఎవరినీ కలవలేదని, ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారని స్పష్టం చేశాడు. తాము కెమెరా ముందుకొచ్చి చెప్పేదాకా.. ఎలాంటి వార్తలను నమ్మొద్దని సూచించాడు. క్లబ్ ప్రైర్ ఫైర్ పోడ్‌కాస్ట్‌లో భాగంగా.. ఆడమ్ గిల్‌క్రిస్ట్, మైఖేల్ వాన్‌లతో మాట్లాడినప్పుడు రోహిత్ ఆ వ్యాఖ్యలు చేశాడు.

తల్లి చేసిన తప్పుకి బాబుకి శాపం.. ప్రెగ్నెన్సీ టైంలో పిల్లి మాంసం తినడంతో..


‘‘నిజం చెప్పాలంటే.. టీ20 వరల్డ్‌కప్ జట్టు గురించి చర్చించేందుకు నేను ఎవ్వరినీ కలవలేదు. అగార్కర్ ఎక్కడో దుబాయ్‌లో గోల్ఫ్ ఆడుతున్నాడు. రాహుల్ ద్రవిడ్ తన కుమారుడి ఆట చూసేందుకు బెంగళూరులో ఉండిపోయాడు. బహుశా ఇప్పుడు ఎర్రమట్టి పిచ్‌పై తన కుమారుడ్ని ఆడించేందుకు ద్రవిడ్ ముంబైకి తీసుకొచ్చాడేమో! అంతే తప్ప.. మేము ఒకరినొకరు కలుసుకోలేదు. నేను, ద్రవిడ్, అగార్కర్ లేదా బీసీసీఐ నుంచి ఎవరైనా ఒకరు స్వయంగా కెమెరా ముందుకొచ్చి మాట్లాడితే తప్ప.. మిగతా వార్తలను నమ్మకండి’’ అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. ఇదే సమయంలో.. త్వరలో జరగబోయే టీ20 వరల్డ్‌కప్ కోసం టీమిండియా స్క్వాడ్‌లో రిషభ్ పంత్ (Rishabh Pant) ఉండాలని తాను కోరుకుంటున్నానని రోహిత్ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు.

సల్మాన్ ఖాన్ కాల్పుల కేసులో మరో కొత్త ట్విస్ట్.. బుధవారం రాత్రి హర్యానాలో..

ఇదిలావుండగా.. జూన్ 1వ తేదీ నుంచి టీ20 వరల్డ్‌కప్ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ టోర్నీ కోసం భారత జట్టుకి రోహిత్ శర్మ నాయకత్వం వహిస్తాడని బీసీసీఐ (BCCI) స్పష్టం చేసింది. కానీ.. ఇతర ఆటగాళ్ల విషయంలో మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే.. జట్టు కూర్పు గురించి రోహిత్, ద్రవిడ్, అగార్కర్ సమావేశమయ్యారని జాతీయ మీడియాలో కథనాలొచ్చాయి. ఓపెనర్‌గా విరాట్ కోహ్లీని (Virat Kohli) రంగంలోకి కూడా దింపనున్నట్టు ప్రచారం జరిగింది. అయితే.. ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదంటూ రోహిత్ శర్మ పైవిధంగా స్పందించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 18 , 2024 | 12:35 PM