IPL 2024: నేడు CSK vs LSG మ్యాచ్..చెన్నై రివేంజ్ తీర్చుకుంటుందా?
ABN, Publish Date - Apr 23 , 2024 | 07:41 AM
ఐపీఎల్ 2024(IPL 2024)లో నేడు 39వ మ్యాచులో లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants), చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ చెన్నై( Chennai)లోని ఎంఏ చిదంబరం స్టేడియం(MA Chidambaram Stadium)లో రాత్రి 7.30 గంటలకు జరగనుంది. అయితే ప్లేఆఫ్ రేస్ నేపథ్యంలో ఇరు జట్లకు కూడా ఈ మ్యాచ్ చాలా కీలకం కానుంది. ఈ నేపథ్యంలో ఏ జట్టు గెలిచే అవకాశం ఉందో ఇక్కడ చుద్దాం.
ఐపీఎల్ 2024(IPL 2024)లో నేడు 39వ మ్యాచులో లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants), చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ చెన్నై( Chennai)లోని ఎంఏ చిదంబరం స్టేడియం(MA Chidambaram Stadium)లో రాత్రి 7.30 గంటలకు జరగనుంది.
అయితే ప్లేఆఫ్ రేస్ నేపథ్యంలో ఇరు జట్లకు కూడా ఈ మ్యాచ్ చాలా కీలకం కానుంది. ఈ సీజన్‌లో ఇరు జట్లు ఇప్పటి వరకు 7-7 మ్యాచ్‌లు ఆడగా 4-4 మ్యాచ్‌లు గెలిచాయి. చెన్నై(CSK) అద్భుతమైన నెట్ రన్ రేట్ కారణంగా పాయింట్ల పట్టికలో నాల్గవ స్థానంలో ఉంది. లక్నో(LSG) జట్టు ఆ తర్వాత ఐదో స్థానంలో ఉంది.
ఈ సీజన్‌లో చెన్నై-లక్నో జట్ల మధ్య ఇది రెండో మ్యాచ్. లక్నోలో జరిగిన మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ సారథ్యంలోని ఎల్‌ఎస్‌జీ(LSG) జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఇప్పుడు చెన్నై సొంత మైదానంలో ఈ మ్యాచ్ ఆడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో రితురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని చెన్నై జట్టు(CSK) ఈ మ్యాచ్‌లో గెలిచి లక్నోపై ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది.
ఇక గూగుల్ గెలుపు అంచనా ప్రకారం చూస్తే నేడు ఈ మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 58 శాతం గెలిచే అవకాశం ఉండగా, లక్నో సూపర్ జెయింట్స్ జట్టు 42 శాతం గెలిచే ఛాన్స్ ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో ఉత్కంఠగా కొనసాగనున్న నేటి మ్యాచులో ఎవరు గెలుస్తారో చూడాలి మరి.
లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) ప్లే 11: క్వింటన్ డి కాక్, కేఎల్ రాహుల్ (WK/C), దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, మాట్ హెన్రీ, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్, యశ్ ఠాకూర్. ఇంపాక్ట్ ప్లేయర్స్: అర్షిన్ కులకర్ణి, కృష్ణప్ప గౌతమ్, యుధ్వీర్ సింగ్, మణిమారన్ సిద్ధార్థ్, అర్షద్ ఖాన్.
చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) ప్లే 11: రుతురాజ్ గైక్వాడ్ (C), రచిన్ రవీంద్ర, అజింక్యా రహానే, మొయిన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ (WK), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, ముస్తాఫిజుర్ రెహమాన్, మతీషా పతిరానా. ఇంపాక్ట్ ప్లేయర్స్: సమీర్ రిజ్వీ, శార్దూల్ ఠాకూర్, షేక్ రషీద్, నిశాంత్ సింధు, మిచెల్ సాంట్నర్.
ఇది కూడా చదవండి:
IMD: దేశంలో మరో 5 రోజులు మండే ఎండలు..ఈ ప్రాంతాలకు అలర్ట్
CIBIL Score: ఈ తప్పులు చేస్తున్నారా.. మీ సిబిల్ స్కోర్ ఖతం
Read Latest Sports News and Telugu News
Updated Date - Apr 23 , 2024 | 08:28 AM