బంగ్లా నుంచి యూఏఈకి
ABN, Publish Date - Aug 21 , 2024 | 05:47 AM
మహిళల టీ20 ప్రపంచకప్ వేదికపై సందిగ్దతకు తెరపడింది. ఈ మెగా ఈవెంట్‌ను బంగ్లాదేశ్ నుంచి యూఏఈకి తరలిస్తున్నట్టు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మంగళవారం ప్రకటించింది...
మహిళల టీ20 ప్రపంచ కప్ వేదిక మార్పు
దుబాయ్: మహిళల టీ20 ప్రపంచకప్ వేదికపై సందిగ్దతకు తెరపడింది. ఈ మెగా ఈవెంట్‌ను బంగ్లాదేశ్ నుంచి యూఏఈకి తరలిస్తున్నట్టు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మంగళవారం ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం అక్టోబరు 3 నుంచి 20 వరకు వరల్డ్ కప్ బంగ్లాదేశ్‌లో జరగాలి. కానీ, అక్కడ రాజకీయ అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో వేదిక తరలింపుపై కొన్నిరోజులుగా ఐసీసీ మల్లగుల్లాలు పడుతున్న సంగతి తెలిసిందే. ఓ దశలో టోర్నీ నిర్వహణ కోసం భారత్‌ను ఐసీసీ సంప్రదించినా, బీసీసీఐ అందుకు ఒప్పుకోలేదు. ఇక, ఆతిథ్యానికి తాము సిద్ధమంటూ జింబాబ్వే క్రికెట్ బోర్డు ముందుకొచ్చినా, ఐసీసీ మాత్రం చివరకు యూఏఈనే ఎంపిక చేసింది.
Updated Date - Aug 21 , 2024 | 05:47 AM