ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

చదువు కోసం ఆటకు వీడ్కోలు

ABN, Publish Date - Aug 23 , 2024 | 06:00 AM

భారత యువ టేబుల్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ అర్చనా కామత్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. కేవలం 24 ఏళ్ల వయస్సులోనే ఆటకు వీడ్కోలు పలుకుతున్నట్టు ప్రకటించింది. భారత మహిళల టేబుల్‌ టెన్నిస్‌ జట్టు పారిస్‌

టీటీ స్టార్‌ అర్చనా కామత్‌ నిర్ణయం

న్యూఢిల్లీ: భారత యువ టేబుల్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ అర్చనా కామత్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. కేవలం 24 ఏళ్ల వయస్సులోనే ఆటకు వీడ్కోలు పలుకుతున్నట్టు ప్రకటించింది. భారత మహిళల టేబుల్‌ టెన్నిస్‌ జట్టు పారిస్‌ ఒలింపిక్స్‌లో తొలిసారి క్వార్టర్స్‌కు చేరి చరిత్ర సృష్టించింది. ఆ టీమ్‌లో అర్చన కూడా సభ్యురాలే. జర్మనీతో జరిగిన పోరులో భారత్‌ 1-3తో ఓడగా.. ఆ ఒక్క గెలుపు కూడా అర్చనా కామత్‌ ద్వారానే రావడం విశేషం. అయితే మరో నాలుగేళ్ల తర్వాత లాస్‌ఏంజిల్స్‌లో జరిగే ఒలింపిక్స్‌లో పతకం సాధించే అవకాశం తక్కువగా ఉండడంతో ఆటను వదిలి విద్యపై దృష్టి సారించాలని భావిస్తోంది. త్వరలోనే యూనివర్సిటీ ఆఫ్‌ మిచిగాన్‌లో అర్చన పబ్లిక్‌ పాలసీపై మాస్టర్స్‌ చదివేందుకు యూఎస్‌ వెళ్లనుంది. వచ్చే గేమ్స్‌లో మెడల్‌ సాధించడం చాలా కష్టమేనని కోచ్‌ చెప్పడంతో..తన 15 ఏళ్ల కెరీర్‌కు వీడ్కోలు పలకడమే ఉత్తమమని కామత్‌ భావించింది.

Updated Date - Aug 23 , 2024 | 06:00 AM

Advertising
Advertising
<