జ్ఞానదత్తుకు కాంస్యం
ABN, Publish Date - Aug 25 , 2024 | 05:55 AM
చైనాలోని చెంగ్డూలో జరుగుతున్న బ్యాడ్మింటన్ ఆసియా అండర్-17 చాంపియన్‌షి్‌పలో తెలుగు కుర్రాడు జ్ఞానదత్తు పతకంతో మెరిశాడు. తెలంగాణకు చెందిన జ్ఞానదత్తు అండర్-17 బాలుర సింగిల్స్‌లో....
న్యూఢిల్లీ: చైనాలోని చెంగ్డూలో జరుగుతున్న బ్యాడ్మింటన్ ఆసియా అండర్-17 చాంపియన్‌షి్‌పలో తెలుగు కుర్రాడు జ్ఞానదత్తు పతకంతో మెరిశాడు. తెలంగాణకు చెందిన జ్ఞానదత్తు అండర్-17 బాలుర సింగిల్స్‌లో కాంస్య పతకం సాధించాడు. శనివారం జరిగిన సింగిల్స్ సెమీఫైనల్లో జ్ఞానదత్తు 21-9, 13-21, 13-21తో రాధిత్య బయు వర్దానా (ఇండోనేసియా) చేతిలో పోరాడి ఓడి కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. ఇక, అండర్-15 బాలికల సింగిల్స్‌లో భారత షట్లర్ తన్వి పత్రి ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీఫైనల్లో టాప్‌సీడ్ తన్వి 21-19, 21-10తో ఆరోసీడ్ కుంగుకే కకానిక్ (థాయ్‌లాండ్)పై గెలిచింది.
Updated Date - Aug 25 , 2024 | 05:55 AM