Viral Video: స్కూటర్‌పై జంట రొమాన్స్..! హగ్ చేసుకొని, కిస్ చేసుకుంటూ రైడ్, వైరల్
ABN, Publish Date - Jan 15 , 2024 | 01:55 PM
కొందరు బహిరంగ ప్రదేశాల్లో కూడా ఇష్టం వచ్చినట్టు ఉంటారు. తమను ఇతరులు చూస్తున్నారని ఆలోచించరు. ముంబైలో ఓ జంట ఇలా రెచ్చిపోయింది. తాము రహదారిలో.. బైక్ మీద ఉన్నామనే సోయి లేకుండా ప్రవర్తించారు. సోషల్ మీడియాలో ఆ వీడియో షేర్ చేయగా తెగ వైరల్ అవుతుంది.
ముంబై: కొందరు బహిరంగ ప్రదేశాల్లో కూడా ఇష్టం వచ్చినట్టు ఉంటారు. తమను ఇతరులు చూస్తున్నారని ఆలోచించరు. తమ ఫొటో, వీడియోలు తీస్తారనే భయం లేకుండా ప్రవర్తిస్తున్నారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో (Mumbai) ఓ జంట (Couple) ఇలా రెచ్చిపోయింది. తాము రహదారిలో.. బైక్ మీద ఉన్నామనే సోయి లేకుండా ప్రవర్తించారు. సోషల్ మీడియాలో ఆ వీడియో షేర్ చేయగా తెగ వైరల్ అవుతుంది.
ముంబై (Mumbai) బాంద్రా వద్ద ఈ ఘటన జరిగింది. స్కూటీని భర్త నడుపుతున్నాడు. అతని ఒడిలో భార్య రివర్స్‌లో కూర్చొంది. ఇద్దరు శాలువా కప్పుకొని ఉన్నారు. ఆ జంట అలా ఉండగా మరొకరు వీడియో తీశారు. వీడియోలో కపుల్ గట్టిగా కౌగిలించుకొని కనిపించారు. ముద్దు కూడా పెట్టుకున్నారు. మరింత దగ్గర కూడా అయ్యారు. అలా రైడ్ చేస్తూ తన్మయత్వంతో ముందుకు సాగుతున్నారు. హెల్మెట్ కూడా పెట్టుకోకుండా ప్రయాణిస్తున్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ వైరల్ అవుతుంది. వీడియోను ఒకతను ముంబై పోలీసులకు ట్యాగ్ చేశాడు. ఆ జంటపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరాడు.
ఇలా ప్రయాణించడం వారికే కాదు ఇతరులకు ప్రమాదమని ఒకరు కామెంట్ చేశారు. అలా జరిగితే వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని అభిప్రాయ పడ్డారు. పోలీసులు ఆ జంటపై చర్యలు తీసుకోవాలని మరొకరు కోరారు. వారి వల్ల రహదారిపై వెళ్లే అందరికి ప్రమాదకరం అంటున్నారు. ఆ జంటపై నెటిజన్లు ఇలా కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Jan 15 , 2024 | 01:55 PM