ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: ట్రక్కులో దేశీ చికెన్ వండిన డ్రైవర్.. వీడియో షేర్, వైరల్

ABN, Publish Date - Jan 11 , 2024 | 06:08 PM

ట్రక్కు డ్రైవర్ దేశీ చికెన్ వండుతూ వీడియో తీశాడు. ఆ వీడియో కుమారుడికి పంపించాడు. అతను షేర్ చేయగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

హైదరాబాద్: సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రపంచం తీరు మారింది. ఆడినా, పాడినా, చివరకు వంట చేసినా సరే వీడియోలు తీసి పోస్ట్ చేస్తున్నారు. వాటిలో మంచి కంటెంట్ చక్కర్లు కొడుతుంది. ఓ ట్రక్కు డ్రైవర్ దేశీ చికెన్ (Chicken) వండుతూ వీడియో తీశాడు. ఆ వీడియో కుమారుడికి పంపించాడు. అతను షేర్ చేయగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ట్రక్కులో హైదరాబాద్ (Hyderabad) నుంచి పాట్నాకు (Patna) వెళుతున్నాడు. టోల్ గేట్ పక్కన లారీని ఆపి వంట చేశాడు. వెజిటేబుల్స్ ఏం తినాలి అనుకున్నాడో ఏమో దేశీ చికెన్ తెచ్చుకున్నాడు. చికెన్ వండటం స్టార్ట్ చేశాడు. ఉల్లిగడ్డలు కోసి నూనెలో వేయించాడు. తర్వాత కుక్కర్‌లో చికెన్‌తో కలిపి వేశాడు. విజిల్ వచ్చిన తర్వాత కర్రీ పూర్తయ్యింది. క్లీనర్‌తో కలిసి తినే వీడియో కూడా పోస్ట్ చేశాడు.

ఆ వీడియో చూసి నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కొందరు ఫుడ్ బ్లాగర్ల కన్నా ఇతను ఫర్లేదు అని ఒకరు, గతంలో మిమ్మల్ని అడిగాను, వింటర్ ఇంటెర్న్ షిప్ ఇస్తారా లేదా అని మరొకరు రాశారు. మీ ట్రక్కులో ఉద్యోగం కోసం ఎక్కడ అప్లై చేయాలని మరొకరు రాశారు.

మరిన్ని వైరల్ న్యూస్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 11 , 2024 | 06:08 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising