ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral news: విమానం డోర్ తెరిచి దూకేసిన ప్రయాణికుడు..అసలేమైంది?

ABN, Publish Date - Jan 11 , 2024 | 11:08 AM

ఒట్టావా ఎయిర్ కెనడా విమానంలో ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. కెనడా నుంచి దుబాయ్ వైపు టేకాఫ్ అవ్వబోతుండగా ఓ వ్యక్తి క్యాబిన్ డోర్ తెరిచి బయటకు దూకాడు. అయితే తర్వాత ఏమైందనే విషయాలు ఇప్పుడు చుద్దాం.

ఓ ఎయిర్ పోర్టులో మరికొద్ది సేపట్లో విమానం టేకాఫ్ కాబోతుంది. అంతలోనే అందులో ప్రయాణించేందుకు సిద్ధమైన ఓ ప్రయాణికుడు ఆకస్మాత్తుగా విమానం డోర్ తెరిచి కిందకు దూకాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన కెనడా(canada)లోని టొరంటో పియర్సన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగింది. కెనడా నుంచి దుబాయ్ వైపు వెళ్తున్న ఎయిర్ కెనడా విమానంలోని ఓ ప్రయాణికుడు దుబాయ్‌కి బయలుదేరే ముందు విమానం నుంచి జనవరి 8న దూకేశాడు.


అయితే అతను తన సీటుపై కూర్చోకుండా క్యాబిన్ డోర్(door) తెరిచి బయటకు దూకినట్లు అక్కడి సిబ్బంది చెబుతున్నారు. అంతేకాదు అతన్ని ఆపేందుకు ప్రయత్నించినప్పటికీ అతను వినకుండా దూకాడని అంటున్నారు. అతను 20 అడుగుల ఎత్తు నుంచి కింద పడ్డాడని ఆ క్రమంలో అతనికి స్వల్ప గాయాలయ్యాయని సిబ్బంది తెలిపారు. ప్రమాదం జరిగిన తర్వాత ప్రాంతీయ పోలీసులు, సిబ్బంది అతన్ని ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం అతని పరిస్థితి ఎలా ఉందనే విషయం తెలియలేదు. ఎయిర్ కెనడా వెబ్‌సైట్(website) ప్రకారం ఈ ఘటన వల్ల బోయింగ్ 747 టేకాఫ్‌లో ఆరు గంటల ఆలస్యమైందని ప్రకటించింది. అయితే ఈ చర్యకు పాల్పడిన ప్రయాణికుడిని అరెస్టు చేస్తారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

Updated Date - Jan 11 , 2024 | 11:08 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising