ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral: ఒకే కాన్పులో పుట్టిన ముగ్గురు పిల్లలు.. అవాక్కైన డాక్టర్లు.. అసలేం జరిగిందంటే..

ABN, Publish Date - Jan 07 , 2024 | 09:08 AM

అమ్మ.. ఆ పేరులోనే ఎంతో ఆప్యాయత, అనురాగం. ప్రతి మహిళ తల్లి కావాలనుకోవడం సహజం. అందుకోసం నవమాసాలు మోసి,

అమ్మ.. ఆ పేరులోనే ఎంతో ఆప్యాయత, అనురాగం. ప్రతి మహిళ తల్లి కావాలనుకోవడం సహజం. అందుకోసం నవమాసాలు మోసి, పురిటినొప్పులనూ పంటిబిగవున భరిస్తుంది. దంపతులు తమకు పుట్టబోయే బిడ్డ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తుంటారు. ప్రెగ్నెన్సీ కన్ఫార్మ్ అయినప్పటి నుంచి డెలివరీ అయ్యేంత వరకు ఎన్నో ఆశలు. అయితే.. బిడ్డకు జన్మనివ్వడం అంత సులభం కాదు. అది ఎంతో క్లిష్టతరమైనది. ఒక్కోసారి కవల పిల్లలు పుట్టడం జరుగుతుంటాయి. వారు చూడడానికి ఒకేలా ఉండవచ్చు ఉండకపోవచ్చు. తల్లి గర్భంతో శిశువు ఎదుగుతున్న సమయంలోనే ఈ మార్పులు జరిగిపోతుంటాయి. అయితే.. తాజాగా యూకేలో జరిగిన ఓ ఘటన వైద్యులను ఆశ్చర్యానికి గురి చేసింది. అదేంటో ఇప్పుడు చూద్దాం...

యూకేలోని హడర్స్‌ ఫీల్డ్ వెస్ట్ యార్క్స్ కు చెందిన ఓ మహిళ ఒకే కాన్పులో ముగ్గురు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. ఇలాంటి కేసులు ఒక మిలియన్ లో ఒకటిగా నమోదవుతుందని వైద్యులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ముగ్గురూ గతేడాది నవంబర్ 10న జన్మించారు. వారికి విల్లో, నాన్సీ, మాబుల్ అని పేరు పెట్టారు. విల్లో బరువు 4 పౌండ్ల 8 ఔన్సులు, నాన్సీ 5 పౌండ్లు, మాబుల్ 4 పౌండ్ల 11 ఔన్సులు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వీరి ముఖాలు ఒకేలా ఉండటంతో వీరికి జన్యుపరీక్షలు చేయించారు. అందులో వైద్యులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. వీరి జన్యువులు ఒకే రకంగా ఉన్నందున ఒకేలా కనిపిస్తున్నారని గుర్తించారు. ఇలాంటి కేసు గత మూడేళ్లలో మూడోది కావడం విశేషం.

"మరిన్ని వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి."

Updated Date - Jan 07 , 2024 | 09:08 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising