ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Mosquitoes: మనిషిని కుట్టిన దోమ అలా చేస్తుందట.. విచిత్ర అలవాటు గురించి తెలిస్తే షాకే..!

ABN, First Publish Date - 2024-02-09T18:36:17+05:30

Mosquitoes Secrete: ఇళ్లలో దోమలు ఉండటం సర్వసాధారణం. ఆ చోటు.. ఈ చోటు అనే తేడా ఏమీ లేదు. ఎక్కడపడితే అక్కడ ఉంటూనే ఉంటాయి. ఇల్లు, ఖాళీ స్థలాలు, మురికి గుంటలు, ఆఫీసులు.. ప్రతి చోటా దోమల రచ్చ మామూలుగా ఉండదు. అందుకే.. ఎక్కడకు పోయినా దోమలు మనుషులను కుడుతూనే ఉంటాయి. దోమలను మనుషులనే కాదు..

Mosquitoes Strange Habits

Mosquitoes Secrete: ఇళ్లలో దోమలు ఉండటం సర్వసాధారణం. ఆ చోటు.. ఈ చోటు అనే తేడా ఏమీ లేదు. ఎక్కడపడితే అక్కడ ఉంటూనే ఉంటాయి. ఇల్లు, ఖాళీ స్థలాలు, మురికి గుంటలు, ఆఫీసులు.. ప్రతి చోటా దోమల రచ్చ మామూలుగా ఉండదు. అందుకే.. ఎక్కడకు పోయినా దోమలు మనుషులను కుడుతూనే ఉంటాయి. దోమలను మనుషులనే కాదు.. జంతువులను కూడా కుడుతాయి. అయితే, దోమలకు ఓ విచిత్ర అలవాటు ఉందట. తాజాగా జరిపిన పరిశోధనలో ఈ విషయాన్ని వెల్లడించారు పరిశోధకులు. ఇంతకీ దోమలకు ఉండే ఆ అలవాటు ఏంటో ఓసారి తెలుసుకుందాం..

దోమలు శరీరాన్ని కుట్టిన తరువాత ‘సూ.. సూ..’ అంటూ విచిత్ర శబ్దాన్ని చేస్తాయట. ఇది వాటికి బాగా అలవాటు అని చెబుతున్నారు పరిశోధకులు. దోమ వ్యక్తిపై వాలి కాటు వేస్తుంది. రక్తం తాగేసి వెళ్తుంది. అలా వెళ్లే సమయంలో దోమలు విచిత్ర శబ్దాలు చేస్తాయని చెబుతున్నారు నిపుణులు.

వాస్తవానికి దొమలలో ఆడ దోమలు మాత్రమే మనుషులను కుడుతాయని మనకు తెలిసిందే. ఆడ దోమల కారణంగా అనేక వ్యాధులు వస్తాయి. దొమ కాటు వల్ల మొదట దురద వస్తుంది. దానిపై రుద్దితే.. ఎరుపు రంగు బొబ్బలు వస్తాయి. అయితే, ఆడ దోమలు రక్తం తాగకుండా గుడ్లు పెట్టలేవట. దొమ వ్యక్తి రక్తం పీల్చడానికి చర్మంపై వాలుతుంది. తనకు ఉన్న సూదిలాంటి ప్రోబోస్సిస్‌ను ఉపయోగించి చర్మంపై కుడుతుంది. ఆ తరువాత దోమ చర్మంలోకి తన లాలాజలాన్ని ఇంజెక్టు చేస్తుంది. దానికి వ్యక్తి శరీరం ప్రతి స్పందిస్తుంది. దోమ కాటుకు గురైన ప్రదేశంలో దురద వస్తుంది.

వ్యాధుల వ్యాప్తి..

దోమ కాటు కొన్ని తీవ్రమైన వ్యాధులకు కారణం అవుతుంది. కొంత మంది పిల్లలు, పెద్దల్లో దోమకాటు కారణంగా రోగనిరోధక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారుతుంది. డెంగ్యూ, మలేరియా, వివిధ రకాల వ్యాధులకు కారణం అవుతుంది. చర్మంపై పెద్ద పెద్ద దద్దుర్లు కూడా వస్తాయి.

దోమలు కుట్టిన చోట ఇలా చేయాలి..

దోమలు కుట్టిన తరువాత ఆ ప్రాంతాన్ని సబ్బు, నీటితో బాగా కడగాలి. వాపు, దురద నుంచి ఉపశమనం పొందడానికి ఒక పది నిమిషాలు ఐస్ ప్యాక్‌తో మసాజ్ మాదిరిగా చేయాలి. పరిస్థితి తీవ్రంగా ఉంటే.. వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి.

Updated Date - 2024-02-09T18:36:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising