Viral News: ఉల్లిపాయ అడిగిన డెలివరీ బాయ్.. సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ ఏంటంటే..
ABN, Publish Date - Dec 26 , 2024 | 03:44 PM
బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తికి ఎదురైన విచిత్ర అనుభవం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ఆన్‌లైన్ ద్వారా ఆర్డర్ చేసిన వస్తువులను డెలివరీ బాయ్ ఇంటికి తీసుకొచ్చి ఇస్తారు. తిరిగి డబ్బులు మాత్రమే తీసుకుంటారు. అయితే బెంగళూరుకు చెందిన ఓ డెలివరీ బాయ్ ఓ ఉల్లిపాయ కూడా అడిగాడు.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత, చాలా విచిత్రమైన విషయాలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. తాజాగా బెంగళూరు (Bengaluru)కు చెందిన ఓ వ్యక్తికి ఎదురైన విచిత్ర అనుభవం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ఆన్‌లైన్ ద్వారా ఆర్డర్ చేసిన వస్తువులను డెలివరీ బాయ్ (Delivery Boy) ఇంటికి తీసుకొచ్చి ఇస్తారు. తిరిగి డబ్బులు మాత్రమే తీసుకుంటారు. అయితే బెంగళూరుకు చెందిన ఓ డెలివరీ బాయ్ ఓ ఉల్లిపాయ (Onion) కూడా అడిగాడు. దీంతో ఆర్డర్ చేసిన వ్యక్తి షాకయ్యాడు (Viral News).
బెంగళూరుకు చెందిన యశ్వంత్ పటేల్ అనే వ్యక్తి తన రెడ్డిట్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించాడు. డెలివరీ బాయ్ తీరుతో తాను, తన భార్య ఇప్పటికీ షాక్‌లోనే ఉన్నామని యశ్వంత్ తెలిపారు. ఆన్‌లైన్‌లో వస్తువులను బుక్ చేసిన తర్వాత ఇన్‌స్టామార్ట్ డెలివరీ బాయ్ ఇంటికి వచ్చాడని, సరుకులను డెలివరీ చేసిన తర్వాత ``ఉల్లిపాయ ఉందా`` అని అడిగాడని యశ్వంత్ తెలిపాడు. అది విన్న యశ్వంత్ దంపతులు ఆశ్చర్యానికి, ఆందోళనకు గురయ్యారు. డెలివరీ బాయ్ ఉల్లిపాయలు అడిగేసరికి భయపడ్డ యశ్వంత్, అతని భార్య నవ్వుతూనే ``బ్రదర్.. మీరు ఏ తంత్ర మంత్రం చేయరు, కదా`` అని అడిగారు. దానికి ఆ వ్యక్తి.. ``కాదు సర్.. తినడానికి నాకు ఉల్లిపాయ కావాలి`` అని బదులిచ్చాడు.
బహుశా పెరుగుతున్న ఉల్లిపాయల ధరల కారణంగా, అతను డెలివరీ చేసిన ఇళ్ల దగ్గర ఉల్లిపాయలు అడుగుతూ జీవనోపాధి పొందుతున్నాడని యశ్వంత్ రెడ్డిట్‌లో కామెంట్ చేశాడు. ఆ పోస్ట్ వైరల్ కావడంతో సోషల్ మీడియా జనాలు తమ స్పందనలను తెలియజేశారు. ``పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా అతను ఉల్లిపాయను అడగవలసి వచ్చింది``, ``ఈరోజు ద్రవ్యోల్బణం పేదవాడి వెన్ను విరిచింది``, ``పేద వ్యక్తుల జీవన పరిస్థితులు మెరుగుపడాల్సి ఉంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: ఈ అమ్మాయికి ఏమైంది? బిజీ రోడ్డు మీద బైక్ అలా నడుపుతోందేంటి.. వీడియో వైరల్..
Viral Video: ఇది ఆల్టో కాదు.. మినీ థార్.. ఓ వ్యక్తి ఇంజినీరింగ్ ప్రతిభ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..
Viral Video: ఇది మామూలు ప్రాంక్ కాదు.. స్నేహితుడిని నమ్మినందుకు ఎలా మోసం చేశాడో చూడండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి
Updated Date - Dec 26 , 2024 | 03:44 PM