ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral: బ్రో.. మీరు మోసపోయారుగా! జరిగిందేంటో మీకింకా అర్థంకాలేదు! బ్రిటిషర్లను హెచ్చరించిన భారతీయులు

ABN, Publish Date - Feb 24 , 2024 | 06:35 PM

తమ సమోసాల ధరక చాలా తక్కువంటూ సంబరపడిపోయిన బ్రిటిషర్లకు కొందరు భారతీయులు వాస్తవమేంటో తెలియజెప్పారు.

ఇంటర్నెట్ డెస్క్: భారత్, ఇంగ్లండ్ (Ind Vs Eng Test) మధ్య రాంచీలో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ సందర్భంగా కొందరు బ్రిటిషర్లు పెట్టిన పోస్ట్ వైరల్‌గా (Viral News) మారింది. ఇది చూసిన భారతీయులు వారు మోసపోయిన విషయాన్ని హైలైట్ చేశారు. విషయం తెలీక సంబరపడుతున్నారంటూ కామెంట్ చేశారు. ఇంగ్లండ్ బార్మీ ఆర్మీ (England Barmy Army) అకౌంట్‌లో కనిపించిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశమవుతోంది.

Viral: ఆడ తోడు దూరమై.. ఎంతటి నరకం అనుభవిస్తోందో! వీడియో చూసి నెటిజన్ల కన్నీళ్లు!


ఇంగ్లండ్ అభిమానులు తొలుత ఓ సమోసాల ప్లేట్‌ను ఫోటో తీసి పెట్టారు. రూ.50 రూపాయలకే రెండు సమోసాలు దొరికాయంటూ సంబరపడిపోతూ చెప్పారు. ఇది తమకెంతో నచ్చిందనే అర్థం వచ్చేలా ఓ ఎమోజీ కూడా జత చేశారు. ఇంగ్లండ్ వాసులకూ భారతీయ సంస్కృతి, ఆహారాలు అలవాటే కానీ అక్కడి రేట్లతో పొలిస్తే ఇక్కడ మరింత తక్కువ ధరకే అవి లభిస్తాయి. తాజాగా ట్వీట్‌లో కూడా బ్రిటిషర్లు ఇదే విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. సమోసాల ధరను పౌండ్లలో (బ్రిటన్ కరెన్సీ) కూడా పేర్కొనడమే ఇందుకు నిదర్శనం. అక్కడ కంటే ఇక్కడే తక్కువకు రుచికరమైన సమోసాలు దొరికాయనేది వారి సంబరం.

Viral: సంబరం పట్టలేకపోయిన ఏనుగు.. అది చేసిన పనికి అధికారులకే ఆశ్చర్యం.. ఈ వీడియో చూస్తే..


అయితే, పోస్ట్ చూసిన వెంటనే భారతీయులు అసలు విషయం పట్టేశారు. బ్రిటిషర్లు మోసపోయారంటూ వరుస కామెంట్లు పెట్టారు. బ్రో.. వాస్తవానికి మీరు మోసపోయారు. సమోసాలకు రూ.10లే ఎక్కువ అంటు ఒకరు కామెంట్ చేశారు. మరికొందరు మాత్రం మరింత ఫన్నీ వ్యాఖ్యలు చేశారు. ఈమారు భారతీయులే బ్రిటిషర్లను దోచేస్తున్నారు (Indians Looting British). ఇదేదో కాస్త ముందు చేసుంటే చరిత్ర మరోలా ఉండేది’’ అని కామెంట్ చేశారు. ఇలా రకరకాల కామెంట్ల మధ్య ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.

Viral: ఇది నిజంగా పిచ్చే, మనుషులు ఇలా ఎందుకుంటారో? 2 ఏళ్ల నాటి వీడియో చూసి ఐఎఫ్ఎస్ అధికారి గుస్సా

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Feb 24 , 2024 | 06:44 PM

Advertising
Advertising