Share News

Viral: సంబరం పట్టలేకపోయిన ఏనుగు.. అది చేసిన పనికి అధికారులకే ఆశ్చర్యం.. ఈ వీడియో చూస్తే..

ABN , Publish Date - Feb 24 , 2024 | 02:56 PM

తన బిడ్డను కాపాడిన అటవీ శాఖ అధికారులకు ఓ తల్లి ఏనుగు తొండం ఎత్తి మరీ నమస్కారం పెట్టింది.

Viral: సంబరం పట్టలేకపోయిన ఏనుగు.. అది చేసిన పనికి అధికారులకే ఆశ్చర్యం.. ఈ వీడియో చూస్తే..

ఇంటర్నెట్ డెస్క్: ఏ జంతువుకైనా మాతృత్వ భావన ఒకటే. తమ బిడ్డలు ఆపదలో ఉంటే తల్లడిల్లిపోయే తల్లి.. ఆ బిడ్డలే సంతోషంగా ఉంటే సంబరపడిపోతుంది. ఇక తన బిడ్డలను ఆదుకున్న వారు ఆమెకు ఆత్మబంధువులే అయిపోతారు. జంతువులు..ముఖ్యంగా తల్లి జీవాలు కూడా ఇవే భావోద్వేగాలకు లోనవుతాయి. సంతోషం పెల్లుబికినప్పుడు మాత్రం తమదైన రీతిలో ఆనందాన్ని వ్యక్తం చేస్తాయి. ఇందుకు తాజాగా ఉదాహరణగా నెట్టింట ఓ వీడియో వైరల్‌గా (Viral) మారింది. ఐఏఎస్ అధికారి సుప్రీయా సాహు (Supriya Sahu) ఈ వీడియెను నెట్టింట షేర్ చేశారు.

Viral: ముక్కులోంచి ఆగకుండా కారుతున్న రక్తం.. పేషెంట్‌‌ను చూసిన డాక్టర్లకే షాక్! చివరకు..


తమిళనాడులోని (TamilNadu) కోయంబత్తూరు జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది. ఐఏఎస్ సుప్రియా తెలిపిన వివరాల ప్రకారం, ఓ గున్న ఏనుగు ప్రమాదవశాత్తూ కాలవలో పడిపోయింది. దీంతో, తల్లి ఏనుగు దాన్ని బయటకు లాగేందుకు ప్రయత్నించింది. అయితే, కాలవలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో తల్లి ఎంత ప్రయత్నించినా గున్న ఏనుగును బయటకు లాగలేకపోయింది. ఈ విషయం అటవీ శాఖ అధికారులకు (Forest Officials) తెలియడంతో వారు వెంటనే రంగంలోకి దిగారు. జాగ్రత్తగా ఆ గున్న ఏనుగును బయటకు తీసుకొచ్చారు (Rescue Baby elephant).

Illegal Trading: ఇంటి నుంచే పని చేస్తున్న భార్య.. ఆమె తన కోలీగ్స్‌తో ఫోన్లో మాట్లాడుతుంటే సీక్రెట్‌గా విని..


కాలవ నుంచి గున్న ఏనుగు బయటకు రాగానే తల్లి ఏనుగు పరిగెత్తుకుంటూ వచ్చింది. దాన్ని గమనించగానే అటవీ అధికారుల బృందం గున్న ఏనుగును అక్కడే వదిలిపెట్టి దూరంగా వెళ్లిపోయారు. కానీ ఏనుగులు తెలివైనవి కాదా! అందుకే, అటవీ శాఖ అధికారులు చేసిన సాయం ఆ తల్లి ఏనుగుకు వెంటనే అర్థమైపోయింది. దీంతో, అది ఆనందం పట్టలేక వారికి తొండం ఎత్తి మరీ నమస్కారం చేసి వెనుదిరిగింది (Elephant thanks officials). ఇది చూసి అధికారులు కూడా ఆశ్చర్యపోయారు. ఈ వీడియోను నెట్టింట పంచుకున్న ఐఏఎస్ అధకారి.. తమకూ ఈ దృశ్యం చూశాక మనసంతా సంతోషంతో నిండిపోయిందని వ్యాఖ్యానించారు.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Feb 24 , 2024 | 06:25 PM