Share News

Illegal Trading: ఇంటి నుంచే పని చేస్తున్న భార్య.. ఆమె తన కోలీగ్స్‌తో ఫోన్లో మాట్లాడుతుంటే సీక్రెట్‌గా విని..

ABN , Publish Date - Feb 23 , 2024 | 04:51 PM

ఇటీవల ఓ ‘వర్క్ ఫ్రం హోం’ ఉద్యోగినికి భారీ షాక్ తగిలింది. భర్త చేసిన పనికి ఆమె ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చింది.

Illegal Trading: ఇంటి నుంచే పని చేస్తున్న భార్య.. ఆమె తన కోలీగ్స్‌తో ఫోన్లో మాట్లాడుతుంటే సీక్రెట్‌గా విని..

ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల ఓ ‘వర్క్ ఫ్రం హోం’ (Work from Home) ఉద్యోగినికి భారీ షాక్ తగిలింది. భర్త చేసిన పనికి ఆమె ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చింది. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో (Texas) వెలుగు చూసిన ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది (Trending).

అమెరికా స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడు టైలర్ లోడన్ టెక్సాస్‌లో ఉంటాడు. ఆయన భార్య బీపీ పీఎల్‌సీ (BP Plc) అనే పెట్రోలియం సంస్థలో మర్జెర్స్ అండ్ ఎక్విసిషన్స్ విభాగం మేనేజేర్‌. ఆమె కొంత కాలం పాటు వర్క్ ఫ్రం హోం చేసింది. ఈ క్రమంలో ఇంట్లోనే కార్యాలయం ఏర్పాటు చేసుకుంది. ఇదిలా ఉంటే, బీసీ పీఎల్‌సీ సంస్థ అప్పట్లో అమెరికాకు చెందిన ట్రావెల్ సెంటర్స్‌ సంస్థను కొనుగోలు చేసే ప్రయత్నంలో ఉంది. ఈ డీల్ వ్యవహారాలను టైలర్ భార్య స్వయంగా పర్యవేక్షించేది. ట్రావెల్ సెంటర్స్‌కు అమెరికా వ్యాప్తంగా పలు పెట్రోల్ బంక్‌లు ఉన్నాయి. కాబట్టి ట్రావెల్ సెంటర్స్ (Travel Centers) సాయంతో అమెరికా మార్కెట్లో వేళ్లూనుకోవచ్చనేది బీపీ పీఎల్‌సీ ప్లాన్.

Anand Mahindra: ఎంత మంచి మనసు తల్లీ నీది! ఈ బాలిక గొప్పతనం తెలిసి ఆనంద్ మహీంద్రానే ఫిదా!


ఈ విలీనంపై టైలర్ భార్య తన కొలీగ్స్‌తో చర్చలు జరుపుతుండగా టైలర్ సీక్రెట్‌గా విన్నాడు (Eavesdropping). విలీనం తరువాత ట్రావెల్ సెంటర్స్ షేర్లు కచ్చితంగా పెరుగుతాయి తెలుసుకున్న అతడు వాటిని ముందుగానే కొనుగోలు చేశారు. ఈ విషయాన్ని మాత్రం భార్యతో చెప్పలేదు. ఇక రెండు సంస్థల మధ్య డీల్ విషయం బయటకు వచ్చాక తన వద్ద ఉన్న షేర్లకు అమ్మి భారీగా సొమ్ము చేసుకున్నాడు. ఈ అక్రమ లావాదేవీతో ఏకంగా 2 మిలియన్ డాలర్ల లాభం పొందాడు (Illegal Trading). ఆ తరువాత తన చేసిన విషయాన్ని భార్యతో చెప్పాడు.

Viral: స్కూల్లో ఫ్రెండ్‌కు కొన్నేళ్ల పాటు హోం వర్క్ చేసిచ్చిన బాలిక.. పెద్దయ్యాక అతడిచ్చిన గిఫ్ట్ చూసి..

టైలర్ చేసిన పనికి అతడి భార్య దిమ్మెరపోయింది. వెంటనే దీని గురించి తన సంస్థకు సమాచారం అందించడమే కాకుండా టైలర్ నుంచి విడిపోయింది. ఆ తరువాత కొద్ది రోజులకే విడాకులకు దరఖాస్తు చేసుకుంది. ఈ మొత్తం విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న కంపెనీ ఆమెను విధుల నుంచి తొలగించింది. ఈ వ్యవహారంలో తన పాత్ర లేకపోయినా ఆమె భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. అటు కెరీర్, ఇటు వ్యక్తిగత జీవితం రెండూ ఒక్కసారిగా పట్టాలు తప్పాయి.

Empty Airplane: ఇద్దరే ప్రయాణికులతో బయలుదేరిన విమానం.. ఒంటరిగా ఉండటంతో తోటి ప్రయాణికుడు చేసిన పనికి..

మరోవైపు, అక్రమ ట్రేడింగ్ విషయం అమెరికా స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థకు (US Securities and Exchange Commission) తెలియడంతో టైలర్ తాను ఆర్జించిందంతా వదులుకోక తప్పలేదు. అక్రమ లావాదేవీలో వచ్చి డబ్బంతా తిరిగిచ్చేందుకు సిద్ధపడ్డ అతడు కొంత మొత్తం జరిమానా కూడా కట్టాల్సి వచ్చింది. అయితే, వర్క్ ఫ్రం హోం కారణంగా ఇలాంటి ఘటనలు గతంలోనూ పలు వెలుగు చూశాయి.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Feb 23 , 2024 | 04:56 PM