Share News

Viral: స్కూల్లో ఫ్రెండ్‌కు కొన్నేళ్ల పాటు హోం వర్క్ చేసిచ్చిన బాలిక.. పెద్దయ్యాక అతడిచ్చిన గిఫ్ట్ చూసి..

ABN , Publish Date - Feb 22 , 2024 | 04:00 PM

చిన్నప్పుడు తన హోం వర్క్ చేసిన బాలికకు ఓ యువకుడు ఏకంగా ఇల్లు కొనిపెట్టేందుకు సిద్ధమయ్యాడు. అసలు కారణం తెలిస్తే..

Viral:  స్కూల్లో ఫ్రెండ్‌కు కొన్నేళ్ల పాటు హోం వర్క్ చేసిచ్చిన బాలిక.. పెద్దయ్యాక అతడిచ్చిన గిఫ్ట్ చూసి..

ఇంటర్నెట్ డెస్క్: చిన్నప్పుడు తనను ఆదుకున్న ఫ్రెండ్‌కు (Schoo Friend) అడక్కుండానే ఓ బాలిక హోం వర్క్ (Homework) చేసిచ్చింది. పెద్దయ్యాక అతడు తిరిగొచ్చి ఇచ్చిన గిఫ్ట్ చూసి దిమ్మెరపోయింది. అసలేం జరిగిందో ఇటీవలే ఆమె నెట్టింట పంచుకుంది. తన పేరు వివరాలను ఆ యువతి బయటపెట్టకపోయినప్పటికీ ఈ ఉదంతం మాత్రం నెట్టింట వైరల్‌గా (Viral) మారింది. నెటిజన్లు ఆశ్చర్యపోయేలా చేస్తోంది.

ఆ యువతికి సెరిబ్రల్ పాల్సీ అనే అనారోగ్యం ఉంది. దీంతో, చిన్నప్పటి నుంచే ఆమెకు తన కండరాలపై కంట్రోల్ ఉండేది కాదు. దీంతో, తోటి విద్యార్థులు ఆమెను నిత్యం వేధించేవారు. కొన్ని సంవత్సరాల పాటు ఆమె జీవితం అలాగే గడిచింది. ఇంతలో ఆ స్కూల్‌లోకి ఓ అబ్బాయి వచ్చాడు. చూస్తుండగానే అతడు స్కూల్లో బాగా పాప్యులర్ అయిపోయాడు. అతడికి చాలా మంది స్నేహితులయ్యారు.

Indian Railways: రైల్లో ఒంటరిగా వెళుతున్న యువతి..తానున్న బోగీలో దృశ్యాన్ని అక్కకు వాట్సాప్‌లో షేర్ చేయడంతో..

ఈ క్రమంలో తోటి విద్యార్థులు ఆమెను ఏడిపిస్తే అతడు వచ్చి అడ్డుకునే వాడు. ఫలితంగా స్కూల్‌లో ఆమెకు వేధింపులు తొలగిపోయాయి. ఓ రోజు అతడు తన పుస్తకాలను ఆమె వద్ద వదిలివెళ్లాడు. దీంతో, ఆమె అతడు అడక్కపోయినా అతడి హోం వర్క్ చేసింది. ఆ తరువాత నుంచి రోజూ ఆమె అతడికి హోం వర్క్ చేసిపెట్టేది. అలా వారు ఒకరితో ఒకరు మాట్లాడకుండానే కుదుర్చుకున్న ఒప్పందం కొన్నేళ్లపాటు కొనసాగింది. చూస్తుండగానే వారి స్కూల్ చదువులు పూర్తయ్యాయి. ఎవరిదారిన వారు వెళ్లిపోయారు. ఆమె అతడి విషయమే మర్చిపోయింది. అనారోగ్యంతో సతమతమవుతూ బతుకీడ్చసాగింది (Boy offers to buy house for girl who did his home work during school days).


ఈలోపు ఆ కుర్రాడు లైఫ్‌లో మంచి సక్సెస్ అందుకున్నాడు. వ్యాపారవేత్తగా మారి మిలియన్లు కొద్దీ డబ్బు సంపాదించాడు. చివరకు ఇటీవల ఓ రోజు ఆమెను సోషల్ మీడియా ద్వారా సంప్రదించాడు. ఇన్నాళ్ల తరువాత అతడి కబురు విన్న యువతికి ఒక్క క్షణం నోటమాట రాలేదు. అతడు తన వివరాలన్నీ ఆమెకు చెప్పాడు. దేవుడి దయ వల్ల తన జీవితం సాఫీగానే సాగిపోతోందని అన్నాడు. అంతేకాకుండా, యువతి అనారోగ్యం తెలిసుండటంతో ఆమెకు ఓ ఇల్లు, కారు కొనిపెట్టేందుకు కూడా ముందుకొచ్చాడు. వైకల్యం ఉన్న యువతి సమాజంలో ఎదుర్కొనే సమస్యలు తనకు తెలుసునన్న అతడు తన బహుమతిని ఆమోదించాలని ఆమెకు విజ్ఞప్తి చేశాడు. కానీ యువతి మొహమాటం కొద్దీ అతడి ఆఫర్‌ను తిరస్కరించింది.

Empty Airplane: ఇద్దరే ప్రయాణికులతో బయలుదేరిన విమానం.. ఒంటరిగా ఉండటంతో తోటి ప్రయాణికుడు చేసిన పనికి..


ఈలోపు యువతికి స్థానికంగా ఉన్న ప్రముఖ ఆసుపత్రిని నుంచి ఫోన్ వచ్చింది. ఆమె చికిత్స కోసం మూడేళ్లకు సరిపడా డబ్బు ఆమె స్నేహితుడే చెల్లించాడని, ఆసుపత్రికి వస్తే ట్రీట్‌మెంట్ ప్రారంభిస్తామని వారు చెప్పారు. మనసులో మొహమాటం వేధిస్తున్నా అనారోగ్యం తాళలేని ఆమె ఆసుపత్రికి వెళ్లింది. అక్కడ రెండు మూడు సెషన్ల చికిత్సకే సాంత్వన లభించడంతో ఆమె ఉబ్బితబ్బిబ్బైపోయింది.

Empty Airplane: ఇద్దరే ప్రయాణికులతో బయలుదేరిన విమానం.. ఒంటరిగా ఉండటంతో తోటి ప్రయాణికుడు చేసిన పనికి..

ట్రీట్‌మెంట్ కొనసాగించాలని ఉన్నా మనసులో ఇబ్బంది వేధిస్తుండటంతో ఆమె ఈ ఉదంతాన్ని నెట్టింట పంచుకుంది. అతడి సాయం తీసుకోవడం భావ్యం కాదేమోనంటూ ఆమె తన సందేహం వెలిబుచ్చింది. కానీ నెటిజన్లు మాత్రం అతడి సాయం తిరస్కరించొద్దని ఆమెకు నచ్చచెప్పారు. చిన్నప్పుడు పొందిన సాయానికి అతడు ప్రత్యుపకారం చేస్తున్నాడని, ఇందులో ఇబ్బంది పడాల్సింది ఏమీ లేదని నచ్చచెప్పారు. ఇక, ఈ ఉదంతం మనసును హత్తుకునేలా ఉండటంతో ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్‌‌లో (Trending) ఉంది.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Feb 22 , 2024 | 04:20 PM