Viral Video: వామ్మో.. ఈమెకు ఏమైంది.. ఏకంగా ట్రాన్స్‌ఫార్మర్ ఎక్కినందుకు ఏం జరిగిందో తెలిస్తే..
ABN, Publish Date - Nov 27 , 2024 | 03:33 PM
కొందరు మానసిక సమస్యలతో బాధపడుతూ చేస్తున్నారో లేదా ఇతరులను ఆకట్టుకునేందుకు పిచ్చి ఎక్కినట్టు ప్రవర్తిస్తున్నారో అర్థం కావడం లేదు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక అలాంటి ఎన్నో వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి.
ప్రస్తుతం కొందరు చేస్తున్న పనులు చాలా చిత్ర విచిత్రంగా ఉంటున్నాయి. మానసిక సమస్యలతో బాధపడుతూ చేస్తున్నారో లేదా ఇతరులను ఆకట్టుకునేందుకు పిచ్చి ఎక్కినట్టు ప్రవర్తిస్తున్నారో అర్థం కావడం లేదు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక అలాంటి ఎన్నో వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. అలాంటి వాళ్లు మనదేశంలోనే కాదు అమెరికా (America) వంటి అగ్రరాజ్యంలో కూడా ఉంటారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే షాక్‌తో కళ్లు బైర్లు కమ్మాల్సిందే. ఆ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది (Viral Video).
vash_elektrik అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. అమెరికాలో ఓ యువతి ట్రాన్స్‌ఫార్మర్ (Transformer) ఎక్కి హల్‌చల్ చేస్తోంది. ఎలక్ట్రిక్ వైర్లపై పాకింది. ట్రాన్స్‌ఫార్మర్ ఎక్కి ఫోజులిచ్చింది. ఆమెను గమనించిన వారు వెంటనే ఎలక్ట్రిక్ డిపార్ట్‌మెంట్ వారికి ఫిర్యాదు చేశారు. వారు వెంటనే ఆ ప్రాంతంలో విద్యుత్తు సరఫరాను నిలిపివేశారు. సిబ్బంది అక్కడకు చేరుకుని ఆ అమ్మాయిని బలవంతంగా కిందకు దించారు. ఆమె చేసిన చర్య వల్ల దాదాపు 800 ఇళ్లకు చాలా సేపు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. స్థానికులు ఆ యువతిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోకు లక్షల్లో లైక్స్, వేలల్లో వ్యూస్ వచ్చాయి. ``ఆమె మానసిక సమస్యతో బాధపడుతోందా``, ``పవర్ స్విచ్ ఆఫ్ చేయకుండా ఉండాల్సింది``, ``వామ్మో.. ఆమెకు భయం లేదా``, ``దేశంలో పెరుగుతున్న చిరాకు ఫలితమే ఇది``, ``డిజిటిల్ డాటాక్స్ లేకపోతే ఇలాగే ఉంటుంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: పానీపూరీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు.. ఏనుగు ఎలా లొట్టలేసుకుంటూ తింటోందో చూడండి..
Viral Video: తుది వీడ్కోలు ఇలాగే ఉండాలేమో.. డెకరేట్ చేసిన కారులో వీళ్లు వెళ్తోంది పెళ్లికి కాదు..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి
Updated Date - Nov 27 , 2024 | 03:33 PM