ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral: నాగు పాముకు పెదవులపై కిస్ ఇచ్చిన యువతి.. ఆ తరువాత ఊహించని విధంగా..

ABN, Publish Date - Mar 26 , 2024 | 03:53 PM

నాగు పాముకు కిస్ ఇచ్చిన యువతి వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

ఇంటర్నెట్ డెస్క్: పాముల్లో కెల్లా అత్యంత ప్రమాదకరమైనది నాగుపాము. ఇతర జీవాలు దాని జోలికెళ్లాలంటేనే ఒణికిపోతాయి. మనుషులైతే దాని పేరు చెబితేనే ఉలిక్కిపడతారు. అలాంటి నాగు పాముకు డేరింగ్‌గా కిస్ ఇచ్చిన యువతి వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా (Viral Video) మారింది. జనాలు విస్తుపోయేలా చేస్తోంది. ఘటన ఎప్పుడు ఎక్కడ జరిగిందీ తెలియకపోయినప్పటికీ జనాలు మాత్రం దిమ్మెరపోతున్నారు (Girl kisses Snake).

Juvenile Robbers: 11 ఏళ్ల వయసులోనే బ్యాంకు దోపిడీ.. సెలవుల్లో స్కూలు పిల్లల దారుణం! ఎలా చేశారంటే..

వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఓ యువతి నాగు పాము పెదాలపైనే నేరుగా కిస్ ఇచ్చింది. అక్కడితో ఆగక దాని తలపై పలు చోట్ల ముద్దు పెట్టింది. యువతి ఇంత చేస్తున్నా పాము మాత్రం ఊహించని విధంగా ఆమెను ఏం చేయకపోవడంతో జనాలు ఆశ్చర్యపోయారు. ప్రాణాలతో ఈ చెలగాటం ఏంటని అనేక మంది ప్రశ్నించారు. నేటి యువతకు వ్యూస్ తప్ప మరొకటి తెలీదని ఆవేదన వ్యక్తం చేశారు. బహుశా పాము యువతి పెంపుడు జంతువై ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు.


వైరల్ అయ్యేందుకు యువతి ఇంత రిస్క్ చేసినా జనాలు మాత్రం ఆమెను తెగ తిట్టిపోశారు. ఇలాంటి సాహసాలు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హితవు పలికారు. వ్యూస్ కోసం మూర్ఖపు పనులు చేయొద్దని, తమ గురించి కాకపోయినా కనీసం కుటుంబసభ్యులు గురించైనా ఆలోచించి బాధ్యతగా వ్యవహరించాలని చెప్పుకొచ్చారు. ఇలా రకరకాల కామెంట్ల మధ్య వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. మరీ ఈ ఒళ్లు గగుర్పొడిచే వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Mar 26 , 2024 | 04:10 PM

Advertising
Advertising