ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: ఛీ.. ఛీ.. ఇండియా గేట్ ముందు అర్ధనగ్న ప్రదర్శన.. రీల్స్ కోసం నడిరోడ్డుపై టవల్‌తో డ్యాన్స్..

ABN, Publish Date - Nov 20 , 2024 | 10:09 AM

ప్రస్తుత డిజిటల్ మీడియా యుగంలో చాలా మంది యువతీయువకులు రీల్స్ రూపొందించడంలో బిజీ అవుతున్నారు. ఏదో ఒకటి చేసి పాపులారిటీ సంపాదించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు భయంకర సాహసాలు చేస్తుంటే, మరికొందరు బహిరంగ ప్రదేశాల్లో న్యూసెన్స్ చేస్తున్నారు.

Girl danced in front of India Gate wearing only a towel

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో చాలా మందిని రీల్స్ (Reels) పిచ్చి పట్టుకుంది. రీల్స్ చూస్తూ ఎక్కువ సమయం గడిపేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. దీంతో చాలా మంది యువతీయువకులు రీల్స్ రూపొందించడంలో బిజీ అవుతున్నారు. ఏదో ఒకటి చేసి పాపులారిటీ సంపాదించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు భయంకర సాహసాలు చేస్తుంటే, మరికొందరు బహిరంగ ప్రదేశాల్లో న్యూసెన్స్ చేస్తున్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ యువతి హద్దు మీరి ప్రవర్తించింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Viral Video).


sannati అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోను ముంబై (Mumbai)లోని ఇండియా గేట్ ఎదుట చిత్రీకరించారు. ఆ వీడియోలో ఓ యువతి పట్ట పగలు, నడిరోడ్డు మీద రద్దీగా ఉండే ఇండియా గేట్ (India Gate) ఎదుట అర్ధనగ్నంగా డ్యాన్స్ చేసింది. ఓ టవల్ (Towel) కట్టుకుని డ్యాన్స్ (Dance) చేసింది. చుట్టు పక్కల ఉన్న ప్రజలు ఆ అమ్మాయి డ్యాన్స్‌ను ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఆ అమ్మాయిని తమ కెమెరాల్లో బంధించేందుకు కొంత మంది ప్రయత్నిస్తున్నారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియోపై కొందరు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ఆ వీడియోలో డ్యాన్స్ చేసిన యువతి కోల్‌కతాకు చెందిన ఓ మోడల్. 2017లో ``మిస్ కోల్‌కతా`` విజేతగా నిలిచింది. ఇండియా గేట్ ఎదుట తాజాగా ఈమె చేసిన అర్ధ నగ్న ప్రదర్శనకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. ఈ వీడియోను లక్షల మంది వీక్షించారు. 10 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు ఆగ్రహంగా స్పందించారు. ``ఈమెను వెంటనే అరెస్ట్ చేయాలి``, ``వ్యూస్, లైక్స్ పొందడానికి చాలా తక్కువ ఖర్చుతో కూడిన చర్య`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral: మేం అంబానీల కంటే తక్కువ కాదు.. మా ఇంట పెళ్లికి రండి.. వైరల్ అవుతున్న వెడ్డింగ్ కార్డ్..


Viral Video: పాకిస్తాన్ మోడల్.. ఇదెక్కడి బైక్‌రా నాయనా.. ఒకేసారి ఐదుగురకి ఛాన్స్.. చూస్తే నవ్వాపుకోలేరు..


Viral Video: చిన్న వయసులోనే చాలా విషయాలు తెలుసుకున్నాడు.. ఎగ్జామ్‌లో ఆ కుర్రాడు రాసింది చదివితే..


Viral Video: వామ్మో.. హార్ట్ ఎటాక్ రప్పించిన ఏనుగు.. రోడ్డ మీద నడుస్తూ ఆకస్మాత్తుగా ఏం చేసిందో చూడండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 20 , 2024 | 10:09 AM