ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral News: పిల్లల్ని కనండి.. డబ్బు పొందండి.. వింత ఆఫర్ పై రగులుతున్న వివాదం..

ABN, Publish Date - Mar 12 , 2024 | 03:26 PM

ఏ దేశానికైనా ఆ దేశ జనాభానే ప్రధాన వనరు. పని చేసే శక్తి ఎక్కువగా ఉన్న దేశం ఆర్థికంగా పరుగులు పెడుతుంది. ఇప్పటివరకు జనాభాలో అగ్రస్థానంలో ఉన్న చైనా ( China ).. భారత్ ధాటికి రెండో స్థానానికి పరిమితమైంది.

ఏ దేశానికైనా ఆ దేశ జనాభానే ప్రధాన వనరు. పని చేసే శక్తి ఎక్కువగా ఉన్న దేశం ఆర్థికంగా పరుగులు పెడుతుంది. ఇప్పటివరకు జనాభాలో అగ్రస్థానంలో ఉన్న చైనా ( China ).. భారత్ ధాటికి రెండో స్థానానికి పరిమితమైంది. డ్రాగన్ దేశం అవలంబిస్తున్న అనేక విధానాలు ఆ దేశ జనాభా తగ్గిపోవడానికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. ఈ క్రమంలోనే చైనీయులకు కొత్త చిక్కు వచ్చి పడింది. శ్రామిక శక్తి తగ్గిపోవడంతో ఉత్పాదకత తగ్గిపోతోంది. ఈ ప్రభావం ఆ దేశ ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపుతోంది. ఈ క్రమంలోనే పలు కంపెనీలు జనాభా పెంచుకోవాలని నిర్ణయించుకున్నాయి. అందుకోసం వింత వింత ప్రకటనలు చేస్తున్నాయి. తాజాగా పిల్లల్ని కనండి-డబ్బు పొందండి అంటూ ఓ కంపెనీ మహిళలకు వింత ఆఫర్‌ ప్రకటించింది. ఇది ఇంటర్నెట్‌లో పెను దుమారం రేపింది.

మహిళలు సరోగసి ద్వారా తల్లులుగా మారవచ్చని, తద్వారా డబ్బులు సంపాదించవచ్చని చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌కు చెందిన హుచెన్ హౌస్ కీపింగ్ కంపెనీ ఈ వింత ప్రకటన ఇచ్చింది. 28 ఏళ్లలోపు వయసున్న వారికి 35,000 US డాలర్లు (అంటే రూ. 25 లక్షల కంటే ఎక్కువ), 29 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలకు 2,10,000 యువాన్లు (సుమారు రూ. 25 లక్షలు), 40 నుంచి 42 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలు ఈ పని చేయాలనుకుంటే వారికి 1,70,000 యువాన్లు (రూ. 20 లక్షలు) అందిస్తామని ప్రకటనలో పేర్కొంది.


అయితే చైనాలో సరోగసి చట్ట విరుద్ధం. దీనిని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. మరోవైపు తాము ఇచ్చిన ఆఫర్ పై కంపెనీల వింత వాదనలు వినిపించింది. ఈ ఆఫర్‌తో తాము చాలా కుటుంబాలకు ఆర్థిక సహాయం చేస్తున్నామని చెప్పుకొచ్చింది. సోషల్ మీడియా వేదికగా ప్రకటనపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇది మానవ అక్రమ రవాణాను ప్రోత్సహిస్తుందని కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని ప్రత్యేకం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 12 , 2024 | 03:26 PM

Advertising
Advertising