Eating with Hands: వామ్మో.. చేతులతో భోజనాన్ని కలుపుకుని తింటే ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా!
ABN, Publish Date - Dec 08 , 2024 | 02:45 PM
చేతులతో భోజనం చేయడమనే భారతీయ సంప్రదాయంతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని ఆయుర్వేదం చెబుతోంది. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: కాలం వేగంగా కదిలిపోతుంటుంది. ఒకప్పటి సంస్కృతి, అలవాట్ల స్థానాన్ని కొత్తవి భర్తీ చేస్తుంటాయి. కానీ తరతరాలుగా కొనసాగుతున్న భారతీయ భోజనం విధానం కాల పరీక్షకు తట్టుకుని నిలబడిందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. వివిధి డిజైన్లలో స్పూన్లు, ఇతర కట్లరీ ఎన్ని వచ్చినా కొందరు మాత్రం చేతులతో అన్నం కలుపుకుని తినేందుకే మొగ్గు చూపుతారు. అయితే, ఇలా చేతులతో కలుపుకుని తినడం కేవలం సంప్రదాయం మాత్రమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు (Viral).
Contagious Yawning: ఒకరిని చూసి మరొకరు ఆవలిస్తారు! ఎందుకో తెలిస్తే..
ఆయుర్వేదం ఏం చెబుతోందంటే..
ప్రకృతితో మమేకమువుతూ ఎలా జీవించాలో ఆయుర్వేదం బోధిస్తుంది. ఇది భారత్‌లో తరతరాలుగా కొనసాగుతున్న వైద్య విధానం. భోజనాన్ని వేళ్లతో కలుపుకుని తింటే కలిగే ప్రయోజనాలను ఆయుర్వేద శాస్త్రం సవివరంగా చెప్పింది. దీని ప్రకారం, మన వేళ్లు పంచభూతాలకు ప్రతీకలు. కాబట్టి, వేళ్లతో కలుపుకుని భోజనం చేస్తున్నామటే ఈ పంచభూతాల అనుగ్రహాన్ని కోరుతున్నామని అర్థం. ఫలితంగా శరీరంలో ఈ శక్తుల మధ్య సమతౌల్యం ఏర్పడుతుందట. అంతేకాకుండా, చేతులతో భోజనాన్ని తాకినప్పుడు మనం ఆహారం తీసుకునేందుకు సిద్ధమయ్యామనే సంకేతం మెదడుకు మరింత సమర్థవంతంగా చేరుతుంది. ఇందుకు అనుగూణంగా కడుపు, ఇతర జీర్ణవ్యవస్థను మెదడు సిద్ధం చేస్తుంది. చేతులతో తింటున్నప్పుడు ఎంత తింటున్నామనేది కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఫలితంగా, అతిగా తిండి తినకుండా జాగ్రత్త పడి బరువును అదుపులో పెట్టుకుంటారు.
Viral: 50 ఏళ్ల క్రితం డైవర్స్.. ఇన్నాళ్లకు మళ్లీ పెళ్లిచేసుకోనున్న వృద్ధ జంట!
ఆయుర్వేదమే కాకుండా ఆధునిక వైద్య శాస్త్రం కూడా చేతులతో తింటే పలు ప్రయోజనాలు ఉన్నాయని చెబుతోంది.
చేతులతో తినేటప్పుడు వేళ్లు బాగా కదిలి ఆయా భాగాలకు రక్తప్రసరణ పెరిగి కీళ్లు పట్టేయడం వంటి సమస్యలు రావు
చేతులతో తినేవారిలో భోజన సమయంలో కడుపులో జీర్ణరసాలు బాగా ఊరుతాయి. ఫలితంగా ఆహారం మరింత సమర్థవంతంగా జీర్ణమవుతుంది.
వేళ్లలో భోజనాన్ని తాకినప్పుడు దాని సువాసలు, ఉష్ణోగ్రత, టెక్స్చర్ వంటివన్నీ తెలిసిపోతాయి. ఫలితంగా ఆహారం తిన్నామన్న సంతృప్తి కలుగుతుంది.
చేతులతో భోజనం వేగంగా చేయలేము కాబట్టి రక్తంలో చక్కెరలు తీవ్ర ఒడిదుడుకులకు లోనుకావు. ఇది డయాబెటిక్ వ్యాధి గ్రస్తులకు అత్యంత అనుకూలం.
చివరిగా.. చేతులపై ఉండే కొన్ని రకాల హితకర బ్యాక్టీరియా శరీరంలో చేరి ఆరోగ్యాన్ని ఇనుమపడించేస్థాయి.
Viral: మంచనా 85 ఏళ్ల వృద్ధుడు! పక్కనే నిలబడి 22 ఏళ్ల గర్ల్‌ఫ్రెండ్ డ్యాన్స్!
Updated Date - Dec 08 , 2024 | 02:45 PM