Viral: 50 ఏళ్ల క్రితం డైవర్స్.. ఇన్నాళ్లకు మళ్లీ పెళ్లిచేసుకోనున్న వృద్ధ జంట!
ABN , Publish Date - Dec 08 , 2024 | 11:22 AM
సుమారు 50 ఏళ్ల క్రితం విడాకులు తీసుకున్న ఓ అమెరికా జంటకు ఒకరిపై ఒకరికి మమకారం మాత్రం మిగిలుండటంతో మళ్లీ ఇన్నాళ్లకు వివాహ బంధంలో ఒక్కటయ్యేందుకు నిర్ణయించుకున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: అజరామర ప్రేమ అంటే లైనా మజ్నూ, సలీం అనార్కలీ పేర్లు గుర్తుకువస్తాయి. అయితే, ఇదే కోవకు చెందిన ఓ అమెరికా జంట ఉదంతం ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశం అవుతోంది. సుమారు 50 ఏళ్ల క్రితం విడాకులు తీసుకున్న ఆ జంటకు ఒకరిపై ఒకరికి మమకారం మాత్రం మిగిలుండటంతో మళ్లీ ఇన్నాళ్లకు వివాహ బంధంలో ఒక్కటయ్యేందుకు నిర్ణయించుకున్నారు. తమది కాలపరీక్షకు నిలిచిన బంధం అంటూ ఘనంగా చాటుకున్నారు (Viral).
Viral: మంచనా 85 ఏళ్ల వృద్ధుడు! పక్కనే నిలబడి 22 ఏళ్ల గర్ల్‌ఫ్రెండ్ డ్యాన్స్!
పెన్సిల్వేనియాలోని లాంకాస్టర్ కౌంటీకి చెందిన 89 ఏళ్ల ఫే గేబుల్, 94 ఏళ్ల రాబర్ట్ వైన్‌రిచ్ విడాకులతీసుకున్న సుమారు 50 ఏళ్లకు మళ్లీ ఒక్కటికానున్నారు. కొడుకులు, కూతుళ్లు, మనవలు, మునిమనవల మధ్య తమ వివాహ బంధాన్ని మళ్లీ పునరుద్ధరించుకోనున్నారు. నేడే వారి వివాహం. ఇద్దరిని చూస్తుంటే ప్రేమలో పీకల్లోతు మునిగిపోయిన టీనేజర్లు గుర్తుకొస్తున్నారు అని ఆ వృద్ధ జంట బంధువొకరు కామెంట్ చేశారు.
ఫే, రాబర్ట్‌ల వివాహం 1951 నవంబర్‌లో తొలిసారిగా జరిగింది. వారికి నలుగురు పిల్లలు కలిగాక వ్యక్తిగత కారణాల రీత్యా విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత ఇద్దరూ వేరే పెళ్లిళ్లు చేసుకున్నారు. తమ జీవిత భాగస్వాములు బతికున్నంత వరకూ వారితోనే జీవన ప్రయాణం కొనసాగించారు. అయితే, విడాకుల తరువాత కూడా వారి మధ్య స్నేహం మిగిలే ఉంది. దీంతో, కుటుంబకార్యక్రమాలకు ఇద్దరూ హాజరువుతుండే వారు. తమ పిల్లల పెళ్లిళ్లు, మునిమనవళ్ల జననం వంటి అద్భుత ఘట్టాలను కనులారా వీక్షించారు. ఆ సమయంలోనే వారి రెండో వివాహానికి బీజం పడింది.
Viral: జస్ట్ 2 ఏళ్ల వయసు.. ఇంత స్పీడేంటిరా! ఈ తరం రేంజే వేరు!
ఈ జంట లవ్ స్టోరీ 1950లో మొదలైంది. రాబర్ట్, ఫే పెద్దన్న ప్రాణ స్నేహితులు. అలా ఫేకు రాబర్ట్‌తో పరిచయం ఏర్పడింది. ఫేకు అతడు నచ్చడంతో ఏదోక రోజు అతణ్ణే వివాహం చేసుకుంటానని ఫే తన సోదరులతో చెబుతుండేది. చివరకు అదే నిజమైంది. కొన్నాళ్ల పాటు డేటింగ్ చేసి ఇద్దరు చివరకు వివాహ బందంలో ఒక్కటయ్యారు. ఆ తరువాత వివిధ కారణాలతో 1975లో విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత ఇద్దరూ వేర్వేరు వివాహాలు చేసుకున్నారు.
అయితే, వారి భాగ్వాములు మరణించడంతో ఇద్దరి మధ్య ఎన్నో ఏళ్లుగా ఉన్న స్నేహం మళ్లీ ప్రేమ చిగురించేలా చేసింది. గడిచిన కాలపు మధుర స్మృతులు గుర్తు చేసుకున్న వారు మళ్లీ ఒక్కటయ్యేందుకు రెడీ అయ్యారు. ఈ సందర్భంగా ఫే గురించి మాట్లాడుతూ రాబర్ట్ భావోద్వేగానికి గురయ్యాడు. ‘‘ఆమె మళ్లి నా సొంతం అవుతుందని అస్సలు ఊహించ లేదు. ఇక భవిష్యత్తు అంతా సంతోషంగా గడిచిపోతుంది’’ అని చెప్పుకొచ్చాడు.
Kitchen: వాస్తు శాస్త్రం ప్రకారం వంటగదిలో ఈ మార్పులు తప్పనిసరి!
Viral: ఏం ఐడియా బ్రో.. గుళ్లల్లో చెప్పులు చోరీ కాకుండా ఉండేందుకు భలే చిట్కా!