నిజాంబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో బతుకమ్మ వేడుకలు
ABN, Publish Date - Oct 09 , 2024 | 12:55 PM
నిజాంబాద్ జిల్లా: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దంపట్టే బతుకమ్మ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. తీరొక్క పూలతో చేసిన బతుకమ్మలతో పల్లెలు, పట్టణాలన్నీ వర్ణరంజితమయ్యాయి. బతుకమ్మ వేడుకల్లో భాగంగా నిజాంబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేయర్ నీతు కిరణ్ పాల్గొన్నారు. చిన్నారులు, మహిళలు కార్యాలయానికి చేరుకుని ఆడీ పాడారు.
నిజాంబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మేయర్ నీతు కిరణ్..
బతుకమ్మ చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తున్న మహిళలు, బాలికలు..
బతుకమ్మ వేడుకలు జరుపుకునేందుకు నిజాంబాద్ మున్సిపల్ కార్యాలయానికి వస్తున్న మహిళలు..
మహిళలతో కలిసి బతుకమ్మ పాటలు పాడుతూ.. నృత్యం చేస్తున్న మేయర్ నీతు కిరణ్..
బతుకమ్మ వేడుకలు జరుపుకునేందుకు వచ్చిన మున్సిపల్ కార్మికులు.. ప్రక్కన మేయర్ నీతు కిరణ్..
Updated Date - Oct 09 , 2024 | 12:55 PM